హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలెర్ట్.. రెండు రోజులు… ఈ రూట్లలో అస్సలు వెళ్లొద్దు…
గ్రేటర్ హైదరాబాద్‌లో బోనాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రెండ్రోజులపాటు ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు

Hyderabad Traffic Alert: గ్రేటర్ హైదరాబాద్‌లో బోనాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రెండ్రోజులపాటు ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఇవాళ (20వ తేదీ), రేపు (21వ తేదీ) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.
సింహవాహిని మహంకాళి లాల్ దర్వాజా బోనాల నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు.
♦ ఇంజన్ బౌలి, ఫలక్‌నుమా వైపు నుంచి అలియాబాద్ వైపునకు వచ్చే వాహనాలను న్యూ షంషేర్ గంజ్ నుంచి గోశాల, మిస్రీగంజ్ వైపునకు మళ్లిస్తారు.
♦ మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్డు నుంచి అలియాబాద్ వైపునకు వచ్చే వాహనాలను ఇంజన్ బౌలి నుంచి జహనుమా, గోశాల వైపునకు డైవర్ట్ చేస్తారు.
♦ నాగులచింత, సుధాటాకీస్ వైపు నుంచి లాల్ దర్వాజా వైపునకు వచ్చే వాహనాలను గౌలిపురా వైపునకు మళ్లిస్తారు.
♦ చార్మినార్ వైపు నుంచి నల్లచింత వైపునకు వచ్చే వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్ వైపునకు మళ్లిస్తారు. ఇవేకాక.. పలు రూట్లలో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు.
♦ గౌలిపురా నుంచి లాల్ దర్వాజ వైపు వచ్చే ట్రాఫిక్ ను సుధా టాకీస్ వద్ద హరిబౌలి మీదుగా మీర్‌చౌక్ వైపు మళ్లిస్తారు.
♦ రాజన్న బౌలి నుంచి లాల్ దర్వాజ ఆలయం వైపు వచ్చే ట్రాఫిక్ ను వెంకటేశ్వర స్వామి ఆలయం లేన్ వద్ద రామస్వామి గంజ్ వైపు డైవర్ట్ చేయనున్నారు.
♦ మదీనా క్రాస్ రోడ్స్ నుంచి ఇంజిన్ బౌలి వరకు ప్రధాన రహదారి, గుల్జార్ హౌస్ చార్మినార్ స్మారక చిహ్నాలు, చార్మినార్ బస్ టెర్మినల్, హిమ్మత్ పురా, నాగులచింత, అలియాబాద్ మధ్య బోనాలు ఊరేగింపులు ముగిసే వరకు అన్ని రకాల వాహనాలను అనుమతించరు.
అంబర్ పేట్ మహంకాళి ఆలయ పరిసరాల్లో 20వ తేదీ ఉదయం 6గంటల నుంచి 22వ తేదీ ఉదయం 6గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
♦ ఉప్పల్ నుంచి చాదర్ ఘాట్, ఎంజీబీఎస్ వైపునకు వెళ్లే భారీ వాహనాలు, సిటీ బస్సులు, ఆర్టీసీ బస్సులను అంబర్ పేట ప్లై ఓవర్ పైనుంచి అనుమతిస్తారు.
♦ చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్ నుంచి వచ్చే వాహనాలు అంబర్‌పేట ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
♦ సిటీ బస్సులు, జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా ఇదే రూట్స్ లో ప్రయాణించాల్సి ఉంటుంది.
♦ బోనాల వేడుకలకు వచ్చే భక్తులు అండర్ పాస్ ద్వారా జీహెచ్ఎంసీ మైదానంలో తమ వాహనాలను పార్క్ చేయొచ్చు.
చిలకలగూడ కట్టమైసమ్మ పోచమ్మ టెంపుల్ పరిసరాల్లో ఆదివారం, సోమవారం రోజుల్లో ఉదయం 5గంటల నుంచి రాత్రి 11గంటల వరకు సాధారణ వాహనాలకు అనుమతి లేదు
♦ సీతాఫల్‌మండి జంక్షన్ నుండి చిలకలగూడ క్రాస్‌రోడ్స్ వైపు వచ్చే వాహనాలను నామలగుండు – వారసిగూడ క్రాస్‌రోడ్స్ వైపు మరియు సీతాఫమండి ‘టి’ జంక్షన్, ఓయు సిటీ రోడ్ – తార్నాక క్రాస్‌రోడ్స్ వైపు మళ్లిస్తారు. ♦ అల్లుగడబావి, సికింద్రాబాద్ నుంచి చిలకలగూడ క్రాస్‌రోడ్స్ నుంచి సీతాఫల్మండి వైపు వచ్చే వాహనాలను పద్మారావు నగర్ టి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
♦ మున్సిపల్ మైదానాన్ని వాహనాల పార్కింగ్ కు వినియోగించనున్నారు.