మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్.. తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్.. మంత్రి సీతక్క ఆమోదం..

తెలంగాణలో 2,500 ఆగ్రో యూనిట్లు స్థాపించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతిపాదనలకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.

మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్.. తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్.. మంత్రి సీతక్క ఆమోదం..

Agro processing units

Updated On : July 20, 2025 / 1:59 PM IST

Telangana Govt: తెలంగాణలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో మహిళా సాధికారతకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మహిళలకు పారిశ్రామికవాడల్లో 10శాతం ప్లాట్లు కేటాయిస్తుండగా.. తాజాగా.. ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లనూ కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Also Read: Hollyday: గుడ్‌న్యూస్.. రేపు బ్యాంకులు, స్కూల్స్, కాలేజీలు అన్నీ బంద్.. మందుబాబులకు మాత్రం బిగ్‌షాక్..

తెలంగాణలో 2,500 ఆగ్రో యూనిట్లు స్థాపించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతిపాదనలకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధించిన ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. ముఖ్యమంత్రి చాంబర్ నుంచి అనుమతులు రాగానే యూనిట్ల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆసక్తి ఉన్న మహిళలు ఈ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. సెర్ప్ ఆధ్వర్యంలో వారికి ఆర్థిక సహకారం అందించనుంది. ఇక్రిశాట్ సాంకేతిక సహకారంతో యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణతోపాటు ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ తదితర కార్యకలాపాలను మహిళలకు ప్రభుత్వం అప్పగించనుంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యూనిట్లను విస్తరించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆసక్తి కలిగిన మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. వారికి సెర్ప్ ఆధ్వర్యంలో రుణ సదుపాయం కల్పిస్తారు. అయితే, ఒక్కో ఆగ్రో యూనిట్ కు రూ.50లక్షల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వ్యవసాయ ఉత్పత్తులు సమృద్ధిగా లభించే ప్రాంతాలతోపాటు మహిళా స్వయం సహాయక సంఘాలు బలంగా ఉన్న చోట వీటిని ఏర్పాటు చేయనున్నారు. రెండేండ్లలో వీటిని నిర్మించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.