ఇదేం ప్రేమ రా బాబూ : గర్ల్ ఫ్రెండ్స్ కు గిఫ్ట్ గా ఐఫోన్ ఇవ్వడానికి దొంగతనం

ఢిల్లీలో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు బరితెగించారు. గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రసన్నం చేసుకోవడానికి అడ్డదారి తొక్కారు. దొంగతనం చేశారు. తమ గర్ల్ ఫ్రెండ్స్ కి ఐఫోన్-11 గిఫ్ట్ గా

  • Published By: veegamteam ,Published On : October 26, 2019 / 10:21 AM IST
ఇదేం ప్రేమ రా బాబూ : గర్ల్ ఫ్రెండ్స్ కు గిఫ్ట్ గా ఐఫోన్ ఇవ్వడానికి దొంగతనం

Updated On : October 26, 2019 / 10:21 AM IST

ఢిల్లీలో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు బరితెగించారు. గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రసన్నం చేసుకోవడానికి అడ్డదారి తొక్కారు. దొంగతనం చేశారు. తమ గర్ల్ ఫ్రెండ్స్ కి ఐఫోన్-11 గిఫ్ట్ గా

ఢిల్లీలో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు బరితెగించారు. గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రసన్నం చేసుకోవడానికి అడ్డదారి తొక్కారు. దొంగలుగా మారారు. తమ గర్ల్ ఫ్రెండ్స్ కి ఐఫోన్-11 గిఫ్ట్ గా ఇచ్చి వారి మెప్పు పొందేందుకు ఏకంగా చోరీకి పాల్పడ్డారు. డెలివరీ బాయ్ ని దోచుకున్నారు. డెలివరీ బాయ్ దగ్గరున్న పార్సిల్ బ్యాగ్ ని ఎత్తుకెళ్లిపోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు డెలివరీ బాయ్ ని దోచుకున్నారు. పార్సిల్స్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్న సమయంలో దోపిడీకి పాల్పడ్డారు. పార్సిల్ బ్యాగ్ తీసుకుని పరార్ అయ్యారు. షాక్ తిన్న డెలివరీ బాయ్.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. చోరీ పై ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి పార్సిల్స్ బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు.

ఎందుకిలా చేశారని విచారిస్తే.. దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. తమ గర్ల్ ఫ్రెండ్స్ కి ఐ ఫోన్స్ అంటే ఇష్టం అని.. వాటిని గిఫ్ట్ గా ఇవ్వడానికే ఈ చోరీకి పాల్పడ్డామన్నారు. డెలివరీ బాయ్ దగ్గరున్న బ్యాగ్ లో ఐఫోన్స్ ఉన్నాయనే విషయం తమకు తెలుసన్నారు.

కాగా, దోపిడీకి పాల్పడిన వ్యక్తులు తనకు తెలుసు అని బాధితుడు చెప్పాడు. ఆ ముగ్గురు ఈ-షాపింగ్ పోర్టల్ లో పని చేస్తారని తెలిపాడు. దీపావళి సమయంలో గిఫ్ట్ గా ఇచ్చేందుకు కస్టమర్లు ఐఫోన్స్ ఆర్డర్ చేస్తారనే విషయం వారికి తెలుసని, అందుకే ఈ చోరీకి పాల్పడ్డారని వివరించాడు.

చోరీకి పాల్పడిన వారిని శశాంక్ అగర్వాల్ (32), అమర్ సింగ్ (29) గా పోలీసులు గుర్తించారు. గురువారం(అక్టోబర్ 24,2019) చోరీ ఘటన జరిగింది. డెలివరీ బాయ్ పార్సిల్స్ డెలివరీ చేయడానికి పంజాబీ బాగ్ నుంచి వచ్చాడు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు అతడిని అడ్డుకున్నారు. అతడిని బెదిరించి పార్సిల్ బ్యాగ్ ని లాక్కుని పారిపోయారు. ఈ కేసులో మూడో నిందితుడు విశాల్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, చోరీకి గురైన పార్సిల్ బ్యాగ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రసన్నం చేసుకోవడానికి యువకులు చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఇదేం ప్రేమ రా బాబూ అని కామెంట్ చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ కోసం లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నారని వాపోయారు.