హైదరాబాద్ లో ముగ్గురు పిల్లలు మిస్సింగ్

హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు పిల్లల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. స్కూల్‌కి వెళ్లిన పిల్లలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 04:25 AM IST
హైదరాబాద్ లో ముగ్గురు పిల్లలు మిస్సింగ్

Updated On : December 22, 2019 / 4:25 AM IST

హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు పిల్లల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. స్కూల్‌కి వెళ్లిన పిల్లలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు పిల్లల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. స్కూల్‌కి వెళ్లిన పిల్లలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడున్నారోనని ఆందోళన చెందుతున్నారు. సురక్షితంగా ఉన్నారా లేదా భయపడుతున్నారు.  

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పిల్లలు, అమ్మాయిల మిస్సింగ్, కిడ్నాప్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా అదృశ్యం, కిడ్నాప్ లతో నగరంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను స్కూల్స్, భయటికి పంపాలంటేనే భయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. మరికొన్ని ఘటనల్లో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల్లో పిల్లలను కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.