కన్నకొడుకునే హత్య చేసిన తల్లి, కారణం తెలిస్తే మంచి పని చేసిందంటారేమో

  • Published By: naveen ,Published On : October 26, 2020 / 11:15 AM IST
కన్నకొడుకునే హత్య చేసిన తల్లి, కారణం తెలిస్తే మంచి పని చేసిందంటారేమో

Updated On : October 26, 2020 / 11:36 AM IST

mother murder son : విశాఖ మారికవలస రాజీవ్‌ గృహకల్ప కాలనీలో కన్నకొడుకునే హత్య చేసిందో తల్లి. మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసైన అనిల్‌ను అతడి తల్లి చంపేసింది. ఆదివారం(అక్టోబర్ 25,2020) తలపై చిన్న గ్యాస్‌ సిలిండర్‌తో మోది హత్య చేసింది.




తరచూ వేధిస్తుండటంతో తట్టుకోలేకే చంపేశానని చెబుతోంది. తన కొడుకు చేసిన పనుల వల్ల మరే తల్లీ బాధ పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులకు తెలిపింది. మృతుడు అనిల్‌పై గతంలో పలు కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు.