నక్సల్స్ దాడిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి
లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సమీపిస్తున్న వేళ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం నక్సలైట్లు రెచ్చిపోయారు.

లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సమీపిస్తున్న వేళ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం నక్సలైట్లు రెచ్చిపోయారు.
లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం (ఏప్రిల్-9,2019) నక్సలైట్లు రెచ్చిపోయారు. బీజేపీ నేతల కాన్వాయ్ లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చారు.
కాన్వాయ్ లోని చివరి కారులో ఉన్న ఎమ్మెల్యే భీమా మండవితో పాటు ఐదుగురు జవాన్లు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పేలుడు ధాటికి ముక్కలు ముక్కలైపోయింది. పేలుడు జరిగిన వెంటనే నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు.స్పాట్ కు చేరుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది మావోల కాల్పులను తిప్పికొడుతున్నారు.
Read Also : దంతెవాడ నక్సల్స్ దాడిని తీవ్రంగా ఖండించిన మోడీ