Neighbours attack man with acid: పెంపుడు కుక్క కోసం యాసిడ్‌తో పొరుగింటి వారిపై దాడి
పెంపుడు కుక్క కోసం యాసిడ్‌తో పొరుగింటి వారిపై దాడి చేశాడు ఓ వ్యక్తి. బాధితుడికి తీవ్రగాయాలు కావడంతో అతడిని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. గత రాత్రి 10 గంటలకు ఉత్తమ్ నగర్ కు చెందిన అభిషేక్ సింగ్ అనే ఓ యువకుడు తమ పెంపుడు కుక్కను వాకింగ్ కు తీసుకెళ్లాడు.

acid attack
Neighbours attack man with acid: పెంపుడు కుక్క కోసం యాసిడ్‌తో పొరుగింటి వారిపై దాడి చేశాడు ఓ వ్యక్తి. బాధితుడికి తీవ్రగాయాలు కావడంతో అతడిని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. గత రాత్రి 10 గంటలకు ఉత్తమ్ నగర్ కు చెందిన అభిషేక్ సింగ్ అనే ఓ యువకుడు తమ పెంపుడు కుక్కను వాకింగ్ కు తీసుకెళ్లాడు.
ఆ సమయంలో పొరుగింటి వ్యక్తి ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. దీంతో కుక్కను తమ ఇంటి ముందు నుంచి ఎందుకు తీసుకు వెళ్తున్నావంటూ అభిషేక్ తో పొరుగింటి వ్యక్తి గొడవ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిషేక్ తండ్రి రాజేశ్వర్ ఇంట్లోంచి దూసుకువచ్చి తన కుమారుడిని ఎందుకు తిడుతున్నారంటూ పొరుగింటి వారితో వాగ్వివాదానికి దిగాడు.
ఆ సమయంలో ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లోంచి యాసిడ్ సీసా తీసుకువచ్చి రాజేశ్వర్ పై యాసిడ్ పోశాడు పొరుగింటి వ్యక్తి. కాలిన గాయాలతో రాజేశ్వర్ కేకలు వేశాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాసిడ్ దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైద్య పరీక్షల నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు చెప్పారు. అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ తాను కుక్కను తీసుకెళ్లిన వేళ పొరుగింటి వాళ్లు రాళ్లతో దాడి చేశారని ఆరోపించాడు. దీంతో వారు కొడుతున్నారని తన తండ్రికి చెప్పానని, పొరుగింటి వారిని తన తండ్రి నిలదీస్తుండగా యాసిడ్ పోశారని చెప్పాడు. తన తండ్రి తలకు తీవ్రగాయాలయ్యాయని అన్నాడు.
TMC Leader Slapping : రెచ్చిపోయిన మంత్రి అనుచరుడు.. సమస్యలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి