Vanasthalipuram Robbery Case : హైదరాబాద్ వనస్థలిపురంలో రూ.2కోట్ల నగదు దోపిడీ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్

హైదరాబాద్ లో సంచలనం రేపిన వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. దోపిడీ జరిగిందని ఫిర్యాదులో తెలిపిన రూ.2కోట్ల డబ్బును హవాలా డబ్బుగా గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితం ఎంఆర్ఆర్ బార్ యజమానిని కొట్టి డబ్బులతో దుండగులు పరారైనట్లు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాఫ్తు చేసిన పోలీసులు చోరీకి గురైన డబ్బును హవాలా సొమ్ముగా గుర్తించారు.

Vanasthalipuram Robbery Case : హైదరాబాద్ వనస్థలిపురంలో రూ.2కోట్ల నగదు దోపిడీ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్

Updated On : January 9, 2023 / 11:16 PM IST

Vanasthalipuram Robbery Case : హైదరాబాద్ లో సంచలనం రేపిన వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. దోపిడీ జరిగిందని ఫిర్యాదులో తెలిపిన రూ.2కోట్ల డబ్బును హవాలా డబ్బుగా గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితం ఎంఆర్ఆర్ బార్ యజమానిని కొట్టి డబ్బులతో దుండగులు పరారైనట్లు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాఫ్తు చేసిన పోలీసులు చోరీకి గురైన డబ్బును హవాలా సొమ్ముగా గుర్తించారు.

అమెరికా నుంచి ప్రవీణ్ అనే వ్యక్తి డబ్బు పంపిస్తుంటే, హైదరాబాద్ లో దాన్ని మారుస్తున్నారు. రియాసత్ నగర్ లోని ఫారూక్ అదే విధంగా ఎంఆర్ఆర్ బార్ యజమాని వెంకట్ రెడ్డి హవాలా లావాదేవీలు చూస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, రూ.2 కోట్ల నగదు ఎత్తుకెళ్లారని బార్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అనుమానితుడు ఫారూఖ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read..Women Dies After Eating Biryani : బాబోయ్.. బిర్యానీ తిని యువతి మృతి, వారం రోజుల్లో రెండో ఘటన, విచారణకు మంత్రి ఆదేశం

రూ.2 కోట్లు తీసుకెళ్తుండగా అర్థరాత్రి దారి దోపిడీ జరిగినట్లు వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకట్ రెడ్డి వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా హవాలా లింక్స్‌ గుర్తించిన పోలీసులు.. ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. నగదు లావాదేవీలకు సంబంధించిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఫారుఖ్‌తో కలిసి హవాలా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వెంకట్ రెడ్డి, ఫారుఖ్ ల హవాలా లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు.

వనస్థలిపురంలో అర్ధరాత్రి రూ.2 కోట్ల డబ్బు తీసుకుని వెళ్తుండగా దోపిడీ దొంగలు తనపై దాడి చేసి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారని బార్ యజమాని వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదంతా నిజమేనని జనాలతోపాటు పోలీసులు అనుకున్నారు. కానీ తమదైన స్టైల్ లో విచారణ చేసిన పోలీసులు.. ఇదంతా హవాలా మాయ అని అసలు నిజం తేల్చారు.

Also Read..Delhi Anjali Case : పగిలిన తల, బయటకొచ్చిన ఎముకలు, ఇంకా దొరకని మొదడు.. ఢిల్లీ అంజలి కేసులో ఒళ్లు జలదరించే విషయాలు

శుక్రవారం రాత్రి వనస్థలిపురంలో దోపిడీ కేసు వెలుగుచూసింది. వనస్థలిపురంలోని ఎంఆర్ఆర్ బార్ యాజమాని కలెక్షన్ డబ్బుతో ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో దుండగులు తనను ఫాలో అయ్యారని, తనపై దాడి చేసి డబ్బుతో పారిపోయారు అని వెంకట్ రెడ్డి చెప్పిన స్టోరీ.

దోచుకెళ్లిన సొత్తంతా బార్ అండ్ రెస్టారెంట్ లావాదేవీలకు సంబంధించిందేనని పోలీసులు అనుకున్నారు. కానీ, విచారణలో షాకింగ్ నిజం తెలిసింది. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో విచారణ మొదలు పెట్టారు. బాధితుడికి తెలిసిన వ్యక్తులే ఇదంతా చేశారనే అంచనాకు వచ్చారు. దర్యాప్తులో బార్ ఓనర్ వెంకట్ రెడ్డి కాల్ డేటా, వాట్సప్ హిస్టరీ చెక్ చేశారు. దాంతో అసలు గుట్టు బయటపడింది. హవాలా బాగోతం వెలుగులోకి వచ్చింది. పాతబస్తీకి చెందిన ఫారూఖ్ తో కలిసి వెంకట్ రెడ్డి హవాలా చేస్తున్నాడని గుర్తించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఓ ఎన్నారై పంపిస్తున్న డబ్బులు హైదరాబాద్ లో చేతులు మారుస్తున్నట్టు విచారణలో తేల్చారు పోలీసులు. ఇప్పటివరకు అమెరికా నుంచి రూ.28 కోట్లు హవాలా రూపంలో మార్చినట్టు గుర్తించారు.