పెళ్లైనా, ప్రియుడితో ఎఫైర్ నడుపుతున్న కూతురు- కాల్చి చంపిన తండ్రి

పెళ్లైనా, ప్రియుడితో ఎఫైర్ నడుపుతున్న కూతురు- కాల్చి చంపిన తండ్రి

Updated On : January 10, 2021 / 2:04 PM IST

Newlywed woman shot dead by father, for continuing illicit relationship with lover : ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది, పెళ్లైనాకానీ తన పాత ప్రియుడితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న కూతుర్ని కన్నతండ్రి తుపాకీతో కాల్చి చంపాడు. ఫతేపూర్ జిల్లాలోని జైసింగ్ గ్రామంలో నివసించే స్వాతి అనే యువతి (20) కి ఇటీవల వివాహం జరిగింది.  పెళ్లికి ముందు ఆమె మరోక వ్యక్తిని ప్రేమించింది. కానీ తల్లితండ్రులు చూసిన సంబంధం ఒప్పుకుని ఆతనితో తాళి కట్టించుకుని అత్తారింటికి వెళ్ళింది.

పెళ్లై అత్తారింటికి వెళ్లి కొత్త కాపురం ప్రారంభించినా…. పాత ప్రియుడితో మాటలు కొనసాగిస్తూనే ఉంది. ఇది గ్రహించిన అత్తింటివారు ఇతర వ్యక్తులతో మాట్లాడవద్దని అభ్యంతరం చెప్పారు. అయినా ఆమె వినకుండా తన పాత ప్రియుడితో మాట్లాడటం, చాటింగ్ చేయటం చేస్తూనే ఉంది. దీంతో వారు ఆమె తండ్రి చంద్రమోహన్ కు విషయం చెప్పి గురువారం, జనవరి 7న పుట్టింటికి పంపారు.

ఇంటికి వచ్చిన కూతురుకి హితబోధ చేసే క్రమంలో ఆమె తండ్రి శనివారం, జనవరి 9న  ఆమెకు నచ్చ చెప్పబోయాడు. పెళ్లైంది కనుక ఇలాంటి వ్యవహారాలుకట్టిపెట్టి బుధ్దిగా కాపురం చేసుకోమని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో తండ్రి కూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. కోపం పట్టలేని తండ్రితన డబుల్ బ్యారెల్ గన్ తీసి కుమార్తెను కాల్చిచంపాడు.

తర్వాత సమీపంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. చంద్రమోహన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతని వద్దనుంచి తుపాకి, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకన్నారు. ఈ ఘటన జరగటంతో చంద్రమోహన్ భార్య, కుమారుడు భయంతో ఇంట్లోంచి పారిపోయారు. పోలీసులు వారిని వెతికే పనిలో పడ్డారు.