2017 నాటి దాడి కేసులో ఉగ్రవాది అరెస్టు

  • Published By: chvmurthy ,Published On : April 14, 2019 / 12:36 PM IST
2017 నాటి దాడి కేసులో ఉగ్రవాది అరెస్టు

Updated On : April 14, 2019 / 12:36 PM IST

జమ్మూకాశ్మీర్: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)  అధికారులు ఆదివారం ఇర్షాజ్ అహ్మద్ రేషి అనే ఉగ్రవాదిని అరెస్టు చేశారు.  2017 లో జమ్మూ కాశ్మీర్ లోని  లెథపోరాలో  సీఆర్‌పీఎఫ్ సెంటర్‌పై జరిగిన దాడి ఘటనలో 5వ నిందితుడని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 5గురు జవాన్లు మరణించారు. అహ్మద్ రేషి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్ధలో ప్రముఖ పాత్ర పోషించేవాడు. గతంలో హత్య గావించబడ్డ జైషే మహమ్మద్ కమాండర్ నూర్ మహమ్మద్‌కు ఇర్షాద్ అత్యంత సన్నిహితుడు అని తెలుస్తోంది. నిందితుడిని సోమవారం ఏప్రిల్ 15, 2019 నాడు ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చనున్నారు. 

డిసెంబర్ 30, 2017,లో దక్షిణ కాశ్మీర్ లోని లెథపోరా లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ పై  జరిగిన ఉగ్రదాడిలో పాల్గోన్న ఉగ్రవాదులకు రెషీ  ఆశ్రయం కల్పించాడు. అంతేకాదు, ఉగ్రదాడికి ముందు ఇర్షాజ్ అహ్మద్ రేషీ స్వయంగా రెక్కీ నిర్వహించాడని NIA దర్యాప్తులో తేలింది. ఇదే కేసుకు సంబంధించి మరో నలుగురు నిందితులు ఫయాజ్ అహ్మద్ మాగ్రే, మంజూర్ అహ్మద్ భట్, నిసార్ అహ్మద్ తాంత్రాయ్, సయ్యద్ హిలాల్ అంద్రాబిలను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్ట్ చేసింది.