టెర్రర్ హంట్ : హైదరాబాద్‌లో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర లింకులు బయపడ్డాయి. ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరుడు హైదరాబాద్ లో పట్టుబడ్డాడు. ఎన్ఐఏ అధికారులు ఐసిస్ సానుభూతిపరుడు తహాని

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 10:08 AM IST
టెర్రర్ హంట్ : హైదరాబాద్‌లో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర లింకులు బయపడ్డాయి. ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరుడు హైదరాబాద్ లో పట్టుబడ్డాడు. ఎన్ఐఏ అధికారులు ఐసిస్ సానుభూతిపరుడు తహాని

హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర లింకులు బయటపడ్డాయి. ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరుడు హైదరాబాద్ లో పట్టుబడ్డాడు. ఎన్ఐఏ అధికారులు ఐసిస్ సానుభూతిపరుడు తహాని అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. కింగ్స్ కాలనీలో ఉంటున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడు తహాని అరెస్ట్ చేశారు. మాదాపూర్ లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో అతడిని విచారిస్తున్నారు. అతడి నుంచి ల్యాప్ టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నేత కుట్రకు హత్య ప్లాన్ చేశారు. దాని అమలుకు హైదరాబాద్ నుంచి అబ్దుల్ బాసిత్ ఖాదర్ మరో వ్యక్తి వెళ్లారు. తహా వారిద్దరికి నాగ్ పూర్ లో వసతి కల్పించాడు. బాసిత్ ఖాదర్ అరెస్ట్ తర్వాత తహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తహా హైదరాబాద్ లో ఉన్నాడని పక్కా సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో 8 చోట్ల సోదాలు జరిపారు. తహాని అదుపులోకి తీసుకున్నారు.

దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లో బయటపడుతున్నాయి. మరోసారి నగరంలో ఉగ్రవాదుల కదలికలు కనిపించాయి. మైలార్ దేవ్ పల్లిలోని శాస్త్రిపురంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో తహాని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఐసిస్ సానుభూతిపరులు టచ్ లో ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ అభియోగంతో పోలీసులు గతంలో కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదర్ లను అదుపులోకి తీసుకున్నారు.

పాకిస్తాన్ కి చెందిన మహిళతో వీరంతా చాటింగ్ చేసినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నేత హత్యకు రెండేళ్ల క్రితం స్కెచ్ వేశారు. ఈ కుట్రను అమలు చేయడానికి హైదరాబాద్ కి చెందిన ముగ్గురిని రిక్రూట్ చేశారు. ఆ తర్వాత సమాచారం అందడంతో అప్రమత్తమైన ఎన్ఐఏ ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. దీంతో వారి కుట్ర భగ్నమైంది. అప్పటి నుంచి బాసిత్ పరారీలో ఉన్నాడు. 5 నెలల క్రితమే భారత్ వచ్చాడు. నాగ్ పూర్ లో మకాం వేశాడు. 2016, 2018లో వారిపై కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాలేదు. ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించిన ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.