నిర్భయ కేసు..ఇక ఉరే : ముఖేశ్ పిటిషన్ కొట్టివేత

నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసేందుకు రోజులు దగ్గర పడుతున్నాయి. కానీ ఉరి శిక్ష నుంచి తప్పించుకొనేందుకు మాత్రం నిందితులు తప్పించుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 01వ తేదీన నలుగురు నిందితులకు (ముకేశ్ కుమార్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్) ఉరి శిక్ష పడనున్న సంగతి తెలిసిందే.
తాజాగా ముఖేశ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. క్షమాబిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ..దోషి ముకేశ్ కుమార్ సింగ్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు 2020, జనవరి 28వ తేదీ మంగళవారం విచారణ జరిపింది.
తీర్పును 2020, జనవరి 29వ తేదీ బుధవారం వెల్లడించింది. రాష్ట్రపతి అన్ని అంశాలు పరిశీలనలోకి తీసుకున్నాకే…క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారని సుప్రీంకోర్టు వెల్లడించింది.
ఫిబ్రవరి 01వ తేదీన ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే..శిక్ష అమలు వాయిదా పడేలా దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దోషి అక్షయ్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానంలో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ కేసులో మరో ఇద్దరు దోషులు ముకేశ్, వినయ్ శర్మలు వేసిన క్యురేటివ్ పిటిషన్లను ఇప్పటికే సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఉరి తేదీ దగ్గర పడుతున్నా కొద్ది..దోషులు ఇలా పిటిషన్లు దాఖలు చేయడం..శిక్ష అమలును ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయని పలువురు వెల్లడిస్తున్నారు.
వాస్తవానికి జనవరి 22నే ఉరి తీయాల్సి ఉండగా..ముకేశ్ క్షమాభిక్ష అభ్యర్థన ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. తాజా పరిణామాలతో ఫిబ్రవరి 01న ఉరి తీయడం గ్యారంటీ అనే చర్చ జరుగుతోంది. మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.
* దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
* ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. అత్యంత దారుణంగా హింసించారు.
* ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది.
* ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించారు.
* వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
* మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు.
* మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
Read More : షేవింగ్ చేసుకోండి : ఒమర్‌కు షేవింగ్ రేజర్ పంపించాం – బీజేపీ