Lockdown:లాక్‌డౌన్ కారణంగా తినేందుకు బియ్యం లేవని.. విందు కోసం 12 అడుగుల కింగ్ కోబ్రాను చంపేశారు!
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్ డౌన్ కారణంగా దేశంలో కొన్నిచోట్ల ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా తమ ధాన్యాగా

Lockdown:కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్ డౌన్ కారణంగా దేశంలో కొన్నిచోట్ల ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా తమ ధాన్యాగారాల్లో బియ్యం లేవని కొందరు వేటగాళ్లు ఆహారం కోసం అడవిలో వేటకు వెళ్లారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో విందు కోసం 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను వేటగాళ్ల బృందం చంపేసింది. అనంతరం కింగ్ కోబ్రా మాంసాన్ని ముక్కలుగా చేసి విందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కోబ్రా మాంసాన్ని శుభ్రపరించేందుకు అరటి ఆకులను వేశారు. కింగ్ కోబ్రాను చంపిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది.
ఈ వీడియోలో అరుణాచల్ ప్రదేశ్‌లో కింగ్ కోబ్రాను చంపిన వేటగాళ్ల బృందం కనిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేయడంతో బాగా వైరల్ అయింది. ఇందులో ముగ్గురు వేటగాళ్లు చంపిన విషపూరితమైన కింగ్ కోబ్రాను తమ భుజాలపై వేసుకుని కనిపించారు. అడవిలో సరీసృపాలను ఆహారం కోసం చంపారని అంటున్నారు.
కొవిడ్-19 వ్యాప్తితో లాక్ డౌన్ విధించారని దీని కారణంగా తమ ధాన్యాగారాల్లో బియ్యం అయిపోయాయని అందుకు ఆహారం కోసం వేటాడామని ముగ్గురిలో ఒకరు చెప్పారు. ఆహారం కోసం వెతుకుతూ అడవికి వెళ్లామని, అక్కడే తమకు కింగ్ కోబ్రా దొరికిందని తెలిపారు. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ఈ ముగ్గురు వేటగాళ్లపై కేసు నమోదైందని, ముగ్గురిలో ఒకరు పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు.
కింగ్ కోబ్రా చట్టం ప్రకారం రక్షిత సరీసృపాలు, వాటిని చంపడం బెయిల్ మంజూరు చేయలేని నేరంగా పరిగణిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ పెద్ద సంఖ్యలో అంతరించిపోతున్న పాము జాతులకు నిలయంగా మారింది. పరిశోధకులు ఇటీవల ఒక విషపూరిత పాము కొత్త జాతిని కనుగొన్నారు.
Hogwarts School of Witchcraft and Wizardry సహ వ్యవస్థాపకుడు K Rowling కల్పిత పాత్రకు Salazar Slytherin అని పేరు పెట్టారు. పిట్ వైపర్‌ను జూలై 2019లో Pakke Tiger Reserveలోని దట్టమైన ఎవర్ గ్రీన్ అడవుల్లో పరిశోధకుల బృందం కనిపెట్టింది. దీనికి Harry Potter పాత్ర అయిన Trimeresurus Salazar పేరు పెట్టారు.
Also Read | ఏపీలో 8మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా, భయాందోళనలో ఉద్యోగులు