కొత్త చలాన్ల ఎఫెక్ట్ : గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

  • Published By: chvmurthy ,Published On : September 10, 2019 / 06:33 AM IST
కొత్త చలాన్ల ఎఫెక్ట్ : గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

Updated On : September 10, 2019 / 6:33 AM IST

కొత్త చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులతో జరిగిన వాగ్వాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వావాదానికి దిగి ఒక యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గుండెపోటుతో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో ఆదివారం సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం ఈఘటన కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన 35 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన తల్లితండ్రులతో కలిసి ఆదివారం సాయంత్రం కారులో వెళ్తున్నాడు. ఘుజియాబాద్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు కారును ఆపారు. లాఠీలతో కారుపై కొడుతూ కొత్త వాహనచట్టం ప్రకారం కాగితాలు తనిఖీ చేయాలని రూడ్ గా బిహేవ్ చేశారు. డ్రైవింగ్ సీటులో కూర్చున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కాగితాలు అడిగారు. లాఠీలతో కారుపై కొట్టటం నచ్చని ఆ యువకుడు.. పోలీసులకు అభ్యంతరం చెప్పాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ టెన్షన్ పడ్డాడు. స్పాట్ లో కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతడ్నిఆస్ప్రత్రికి తరలించారు. అయినప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించాడు. 

ట్రాఫిక్ పోలీసుల ప్రవర్తన వల్లే తమ కుమారుడు చనిపోయాడని మృతుడి తండ్రి ఆరోపించారు. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించకపోయినా పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని ఆయన అంటున్నారు. కారులో వృధ్దులు ఉన్నారని కూడా చూడకుండా.. లాఠీలతో కారుపై కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నోయిడా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.