ఆన్ లైన్ మనీ యాప్‌ల వేధింపులకు మరొకరు బలి

ఆన్ లైన్ మనీ యాప్‌ల వేధింపులకు మరొకరు బలి

Online Money APP harassment: ఆన్ లైన్ మనీ యాప్ ల వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. విశాఖకు చెందిన సంతోష్ అనే యువకుడు పెద్దపల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ కంపెనీలో సూపర్ వైజర్ గా సంతోష్ పనిచేస్తున్నాడు.

వివిధ యాప్ ల నుంచి దాదాపు 36వలే రుణాన్ని సంతోష్ తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తీర్చలేకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు అతన్ని వేధించడం మొదలుపెట్టారు.

అప్పు తీర్చాలని యాప్ ల ప్రతినిధులు వేధించసాగారు. వారి వేధింపులు భరించలేక సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సంతోష్ సెల్ఫీ వీడియో తీశాడు. ఇప్పుడా ఆ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.