గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి : పులిహోర తిని 100మందికి అస్వస్థత
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లిలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి జరిగింది. ప్రసాదంగా పంచిన పులిహోర తిని 100 మంది అస్వస్థతకు గురయ్యారు.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లిలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి జరిగింది. ప్రసాదంగా పంచిన పులిహోర తిని 100 మంది అస్వస్థతకు గురయ్యారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లిలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి జరిగింది. ప్రసాదంగా పంచిన పులిహోర తిని 100 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గురువారం(సెప్టెంబర్ 12,2019) మధ్యాహ్నం ఈ విషాదం జరిగింది. గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవాలకు ప్రసాదంగా పులిహోర చేయించారు గణేష్ ఉత్సవ నిర్వాహకులు. దాన్ని అందరికీ పంచారు. ఏమైందో కానీ.. పులిహోర తిన్న 100 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. సొమ్మసిల్లి పడిపోయారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందికి గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. కాగా దీని వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులిహోరలో ఎవరైనా కుట్రతో విషప్రయోగం చేయించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పులిహోర ప్రసాదం తిని 100మంది అస్వస్థతకు గురి కావడం స్థానికంగా సంచలనం రేపింది.