మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు.. బాలికపై లైంగిక వేధింపులు, వీడియో వైరల్

సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అత్యంత రహస్యంగా విచారిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు.. బాలికపై లైంగిక వేధింపులు, వీడియో వైరల్

Pocso Case On Ex Mla Sudhakar : కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ పై పోక్సో కేసు నమోదైంది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సుధాకర్ పై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితురాలు కూడా సుధాకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సుధాకర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజాప్రతినిధిగా ఉంటూ దారుణానికి ఒడిగట్టిన సుధాకర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అత్యంత రహస్యంగా విచారిస్తున్నారు. ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ లో సుధాకర్ ను ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. సుధాకర్ ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ఉండాల్సింది పోయి.. బాలికను లైంగికంగా వేధించడం దారుణం అంటున్నారు టీడీపీ నేతలు. ఇక, బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో వైరల్ కావడం సంచలనమైంది.

Also Read : కూటమి ప్రభుత్వం టార్గెట్ నెంబర్ 1 ఆయనేనట..! సీఎం, డిప్యూటీ సీఎం, మాజీ సీఎం ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి