జూబ్లీహిల్స్ వెంకటగిరిలో కార్డన్ సెర్చ్
జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో 150 పోలీసులు పాల్గొన్నారు. 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలులేని 43 బైకులు, 10 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. నగరంలో పోలీసులు తరచూ కార్డన్ సెర్చ్, డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అనునిత్యం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతూ కొంతమంది, మద్యం తాగి డ్రైవ్ చేస్తూ మరికొంతమంది పట్టుపడుతున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేస్తున్నారు.