Somu Veerraju : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై కేసు నమోదు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదయ్యింది. బుధవారం ఉదయం పోలీసుల విధులకు ఆటంకం కలిగించటమే కాక ఎస్సైపై దురుసుగా ప్రవర్తింతచినందుకు ఆలమూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

somu veerraju
Somu Veerraju : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదయ్యింది. బుధవారం ఉదయం పోలీసుల విధులకు ఆటంకం కలిగించటమే కాక ఎస్సైపై దురుసుగా ప్రవర్తింతచినందుకు ఆలమూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం జొన్నాడ వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఏపీ బీజేపీ అధ్యుక్షుడు సోము వీర్రాజుకు, పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై ఆలమూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించి ఎస్ఐ ఎస్ శివప్రసాద్ తెలిపిన వివరాలు వివరాలు ప్రకారం…. ఇటీవల కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం విధించిన 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ముఖ్యమైన నాయకులను, ఎక్కువ మంది కార్యకర్తలకు అనుమతి లేనందున జొన్నాడ వద్ద ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ తన సిబ్బంది నిర్వహిస్తున్నారు.
బందోబస్తులో భాగంగా ఈ రోజు ఉదయం ఆ రోడ్డుపై వెళుతున్న సోము వీర్రాజు కారును పోలీసులు ఆపారు. దీంతో ఉద్రేకానికి లోనైన సోము వీర్రాజు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాక విధి నిర్వహణలో ఉన్న ఎస్సైను నెట్టారు. దీంతో పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 353,506 ల కింద ఆలమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును మండపేట రూరల్ సిఐ శివ గణేష్ దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Andhra pradesh : ‘తోసి పడేస్తా జాగ్రత్త’ పోలీసులపై సోము వీర్రాజు వీరంగం..