Hyderabad Terrorist : ముగ్గురు హిందువులు, మారు పేర్లతో మకాం, పెద్ద నగరాలే టార్గెట్.. ఉగ్ర కుట్రలో వెలుగులోకి సంచలన విషయాలు
Hyderabad Terrorist : పెద్ద నగరాలను టార్గెట్ చేసుకున్న నిందితులు అక్కడే సాధారణ పౌరుల్లా స్థిరపడినట్లు తెలుస్తోంది. అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు మారు పేర్లతో నగరంలో నివాసం ఉంటున్నారు.

Hyderabad Terrorist(Photo : Google)
Hyderabad Terrorist : ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ లో నివ్వెరపోయే విషయాలు తెలుస్తున్నాయి. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితుల్లో ముగ్గురిని హిందువులుగా గుర్తించారు. మారు పేర్లతో నగరంలో నివాసం ఉంటున్నారు. నిందితులు నెల రోజుల క్రితం హైదరాబాద్ కి వచ్చినట్లు గుర్తించారు.
ఉగ్ర కుట్ర కేసులో ఇప్పటివరకు మొత్తం 17మందిని అరెస్ట్ చేశారు. వీరందరికి H.U.T(హిజ్బ్-ఉత్-తహ్రీర్..Hizb-Ut-Tahrir) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రదాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరితో ఒకరికి నేరుగా కాంటాక్ట్స్ లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేసుకున్నట్లు సమాచారం. పెద్ద నగరాలను టార్గెట్ చేసుకున్న నిందితులు అక్కడే సాధారణ పౌరుల్లా స్థిరపడినట్లు తెలుస్తోంది.(Hyderabad Terrorist)
శిక్షణలో భాగంగా 17మంది హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఆరుగురు, భోపాల్ లో అదుపులోకి తీసుకున్న 11మందిని ఏటీఎస్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి భోపాల్ ప్రత్యేక కోర్టు ఈ నెల 18వరకు కస్టడీ విధించింది.
హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడటం ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ సాయంతో భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 17మంది ఉగ్రవాద అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న నిందితులను.. ప్రత్యేక భద్రత నడుమ మధ్యప్రదేశ్ కు తరలించారు.
నిందితుల నుంచి ఫోన్లు, ఉగ్ర సాహిత్యం, కత్తులు, ఎయిర్ గన్ పిస్టల్స్, పెల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇస్లామిక్ జిహాదీని కూడా పోలీసులు గుర్తించారు. వీరంతా 18మంది నెలల నుంచి హైదరాబాద్ లోనే మకాం వేశారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ లో సలీం, రెహ్మాన్, జునైద్, హామీద్, సల్మాన్ అరెస్ట్ అవగా.. భోపాల్ లో జిమ్ ట్రైనర్ యాసిర్ ఖాన్, కోచింగ్ సెంటర్ నడుపుతున్న సయ్యద్ రిజ్వీ, టైలర్ గా పని చేస్తున్న షారూక్, కూలి పనులు చేసే ఇస్లామ్, ఆటో డ్రైవర్ షాహిద్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సలీమ్, టెక్నీషియన్ అలీ, టీచర్ హుస్సేన్ అరెస్ట్ అయ్యారు. వీరంతా వేర్వేరు పనులు చేసుకుంటూ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉగ్ర కుట్రలు చేసినట్లు విచారణలో తేలింది. ఎప్పటి నుంచో వీరిపై నిఘా పెట్టిన ఏటీఎస్.. అదను చూసి అరెస్ట్ చేసింది.
హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఉగ్రవాద అనుమానితులు..
మహ్మద్ సలీమ్ అలియాస్ సౌరభ్ రాజ్ వైద్య(భోపాల్ నివాసి, ఫార్మా కాలేజీలో HOD)
అబ్దుర్ రెహ్మాన్ అలియాస్ దేవీ ప్రసాద పాండా(ఒడిశా వాసి, క్లౌడ్ సర్వీస్ ఇంజినీర్)
వీరిద్దరూ గోల్కొండలో నివాసం ఉంటున్నారు.
మహ్మద్ అబ్బాస్ అలీ అలియాస్ బస్క వేణు కుమార్(ఆటో రిక్షా డ్రైవర్-హఫీజ్ బాబానగర్)
షేక్ జునైద్(డెంటిస్ట్-గోల్కొండ)
మహ్మద్ హామీద్(రోజు కూలీ-జగద్గిరిగుట్ట)
మహ్మద్ సల్మాన్(రోజు కూలీ-షామీర్ పేట్) పరారీలో ఉన్నాడు.