క్రిమినల్ కౌన్..? : జయరాంపై విష ప్రయోగం!

విజయవాడ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కీలక చిక్కుముడి వీడుతోంది. హత్యకు సూత్రధారి, పాత్రధారి ఆయన మేనకోడలు శిఖా చౌదరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శిఖాతోపాటు ఆమె సోదరి మనీషా, శ్రిఖా బాయ్‌ఫ్రెండ్ రాకేశ్ చౌదరి స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డిని విచారిస్తున్నారు.. అమెరికా నుంచి ఆయన భార్య పద్మశ్రీ, కొడుకు సాయిరామ్, కూతురు కావ్యశ్రీ హైదరాబాద్‌లోని స్వగృహానికి చేరుకున్నారు.
శిఖా చౌదరి, రాకేష్‌లు ఒకరినొకరు ప్రేమించుకున్నారని, వీరి వివాహానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని సమాచారం. తన మేనకోడలును వదిలేయమని రాకేష్‌ను జయరామ్ కోరారని, వదిలేయడానికి రూ. 3.5కోట్ల ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఒప్పందం ప్రకారం షికాను రాకేష్ వదిలేశాడు. కానీ జయరామ్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో మళ్లీ ఒక్కటైన శ్రిఖా, రాకేష్‌లు జయరామ్‌ను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారు స్టీరింగ్ మీద ఉన్న వేలిముద్రలు.. జయరాం వేలిముద్రలకు మ్యాచ్ అవ్వడం కేసులో కొత్త ట్విస్టు అన్నారు.. జయరాం హత్యకు హైదరాబాద్‌లోనే కుట్ర జరిగిందని, మృతదేహాన్ని తరలించేందుకు 2 కార్లు వాడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. జయరాంపై విషప్రయోగం చేసి…హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. జయరాం శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు పంపించారు.