దసరా రోజున కలకలం : భారీగా నకిలీ మద్యం పట్టివేత
హైదరాబాద్ శివారులో నకిలీ మద్యం కలకలం రేపింది. శంషాబాద్ లో భారీగా నకిలీ మద్యం పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. లక్షల విలువ చేసే లిక్కర్ ని సీజ్ చేశారు.

హైదరాబాద్ శివారులో నకిలీ మద్యం కలకలం రేపింది. శంషాబాద్ లో భారీగా నకిలీ మద్యం పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. లక్షల విలువ చేసే లిక్కర్ ని సీజ్ చేశారు.
హైదరాబాద్ శివారులో నకిలీ మద్యం కలకలం రేపింది. శంషాబాద్ లో భారీగా నకిలీ మద్యం పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. లక్షల విలువ చేసే లిక్కర్ ని సీజ్ చేశారు. మంగళవారం(అక్టోబర్ 8,2019) నకిలీ మద్యం తయారీ గురించి పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు మద్యం తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. షెట్టర్ లోపల నకిలీ మద్యం తయారీని గుర్తించారు. మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ తో పాటు బహదూర్‌గూడ గ్రామానికి చెందిన మహేందర్, జంగయ్య అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు నుంచి మెటీరియల్ తెచ్చి బాటిళ్లలో నింపి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సంఘీగూడ చౌరస్తాలో ఓ ఇంట్లో ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. డ్రమ్ముల్లో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. వాటిని సీసాల్లో నింపి వాటికి బ్రాండెడ్ లేబుల్స్ వేసి మార్కెట్ లో అమ్ముతున్నారు. పండుగ వేళ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నకిలీ మద్యం తయారు చేసి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుడు మహేందర్ పై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి.
శంషాబాద్ రూరల్ పీఎస్, ఎస్ఓటీ, ఎక్సైజ్ పోలీసులు కలిసి రైడ్ చేశారు. మహేందర్ అనే వ్యక్తి జంగయ్యతో కలిసి మద్యం తయారీ చేస్తున్నాడని చెప్పారు. కర్నూలు నుంచి స్పిరిట్ తెచ్చి మద్యం తయారు చేస్తున్నారని వెల్లడించారు. స్పిరిట్ తీసుకొచ్చి వాటర్ కలిపి బ్లెండ్ తయారు చేశారని, 100 లీటర్ల బ్లెండ్ ఉందని, దాదాపు 40 నుంచి 50 బాటిల్స్ తయారు చేశారని పోలీసులు తెలిపారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి ఎక్కడెక్కడ అమ్మారు అనేది విచారణలో తెలుసుకుంటామన్నారు.