తల్లిని చంపిన కూతురు కేసు : పోలీసుల విచారణలో సంచలన విషయాలు

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునగనూరు గ్రామంలో కూతురే తల్లిని హత్య చేసిన కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 05:40 AM IST
తల్లిని చంపిన కూతురు కేసు : పోలీసుల విచారణలో సంచలన విషయాలు

Updated On : October 29, 2019 / 5:40 AM IST

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునగనూరు గ్రామంలో కూతురే తల్లిని హత్య చేసిన కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునగనూరు గ్రామంలో కూతురే తల్లిని హత్య చేసిన కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ పేరుతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దని చెప్పిన తల్లి రజితను కీర్తి దారుణంగా హత్యచేసింది. అనంతరం శవాన్ని మూడురోజుల పాటు ఇంట్లోనే ఉంచుకుని ప్రియుడితో రాసలీలలు కొనసాగించింది. అయితే తల్లి ఎక్కడని నిలదీసిన తండ్రిపైనే కీర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఈ కేసులో కీర్తి ప్రియుడు, నిందితుడు శశిని పోలీసులు విచారించారు. రజితను చంపేలా కీర్తిని ప్రోత్సహించింది శశి అని పోలీసులు గుర్తించారు. రజితను అడ్డు తొలగిస్తే కీర్తిని పెళ్లి చేసుకోవచ్చని, ఆస్తి దక్కించుకోవచ్చని శశి ప్లాన్ వేశాడని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి, రజితలకు ఏకైక కూతరు కీర్తి. కాగా, శశితో తిరగొద్దని కీర్తిని తల్లి రజిత మందలించింది. దీంతో రజితపై శశి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైన రజిత అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కీర్తి ద్వారా ఆమెను చంపేయాలని స్కెచ్ వేశాడు. కీర్తిని రెచ్చగొట్టి పని పూర్తి చేశాడని పోలీసులు తెలిపారు.

తన సంతోషానికి తల్లి అడ్డుపడుతోందని భావించిన కీర్తి ఈ నెల 19న ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న రజిత కాళ్లు చేతులు ప్రియుడు పట్టుకోగా.. కీర్తి తల్లి గుండెలపై కూర్చుని మెడకు చున్నీ బిగించి చంపేసింది. ఆ తర్వాత మూడు రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకుని ప్రియుడితో రాసలీలలు సాగించింది. శవం దుర్వాసన రావడంతో అర్ధరాత్రి వేళ కారులో తీసుకెళ్లి యాదాద్రి జిల్లా రామన్నపేట సమీపంలోని తుమ్మలగూడెం వద్ద రైల్వేట్రాక్‌పై పడేసింది. మరుసటి రోజు కీర్తి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి రాగా తాళం వేసి ఉంది. భార్యకు ఫోన్ చేయగా ఎత్తలేదు. దీంతో ఆయన కూతురికి ఫోన్ చేయగా ఫ్రెండ్స్‌తో కలిసి వైజాగ్ టూర్‌కి వచ్చినట్లు చెప్పింది.

దీంతో ఆయన తన బంధువుల ఇళ్లల్లో ఆరా తీశాడు. ఈ నెల 26న ఇంటికొచ్చిన కీర్తిని బాబాయ్ కృష్ణారెడ్డి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. తల్లి గురించి తనకేమీ తెలీదని, ఆమె దగ్గర రూ.2వేలు తీసుకుని వైజాగ్‌ వెళ్లానని చెప్పడంతో తండ్రికి అనుమానం వచ్చి గట్టిగా నిలదీశాడు. దీంతో తన తండ్రి తాగొచ్చి రోజూ కొట్టడం వల్లే తల్లి ఎక్కడికో వెళ్లిపోయిందని హయత్‌నగర్ పోలీసులకు కీర్తి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగుచూసింది.