Prostitution Racket : హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు..ఆరుగురు యువతులు అరెస్ట్
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బంగ్లాదేశ్ యువతులను అక్రమంగా ఇండియాకు తీసుకువచ్చి వారితో బలవంతంగా వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Prostitution Racket : ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బంగ్లాదేశ్ యువతులను అక్రమంగా ఇండియాకు తీసుకువచ్చి వారితో బలవంతంగా వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాపూనగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ ఖుల్నా జిల్లాలోని భవానీపూర్‌కు చెందిన కౌసుర్దాస్ నూర్ మహ్మద్ కోలిబా, నహిదా ఖుసుర్దాస్ కోలిబా, కాచి ముషారఫ్ సర్దార్లతో పాటు మరి కొందరు యువతులను అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగ్లాదేశ్ గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్ జిరాక్స్ కాపీలు, నకిలీ ఆధార్ కార్డులు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : CVL Narasimha Rao: దాసరి చెప్పారు.. మంచు విష్ణుకే నా సపోర్ట్!
బంగ్లాదేశ్‌లోని భవానీపూర్‌కు చెందిన కౌసుర్దాస్ నూర్ మహ్మద్, అతని భార్య నహిదా ఖుసుర్దాస్ కోలిబా కొన్నేళ్ల క్రితం అక్రమంగా భారత్‌లోకి వచ్చారు. కొంతకాలం ముంబైలో జీవనం సాగించి.. ఇటీవల హైదరాబాద్‌కు మకాం మార్చారు. బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా తరలించే ఏజెంట్ అతియార్ మొండల్, వ్యభిచార నిర్వాహకుడు కాచి ముషారఫ్‌తో పరిచయం అయ్యాక వీరంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
బంగ్లాదేశ్‌లో పని మనిషులుగా ఉన్న కొందరు యువతులకు అతియార్ మొండాల్ ఇండియాలో మంచి పని, జీతం ఇప్పిస్తాననని మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకు వచ్చేవాడు. వారిని ఇక్కడ సనత్‌నగర్‌లోని వ్యభిచార గ్యాంగ్ కు అప్పగించేవాడు. ఈ ముఠా వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు.