Pudding and Mink Pub Drug Case : డ్రగ్స్ కేసులో నిందితుల బెయిల్, కస్టడీ పిటీషన్లపై రేపు విచారణ

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పుడింగ్ అండే మింక్ పబ్‌లో దొరికిన డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన అభిషేక్, అనిల్ ల తరుఫున న్యాయవాదులు నాంపల్లి

Pudding and Mink Pub Drug Case : డ్రగ్స్ కేసులో నిందితుల బెయిల్, కస్టడీ పిటీషన్లపై రేపు విచారణ

pudding and mink pub

Updated On : April 5, 2022 / 3:29 PM IST

Pudding and Mink Pub Drug Case :  హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పుడింగ్ అండే మింక్ పబ్‌లో దొరికిన డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన అభిషేక్, అనిల్ ల తరుఫున న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే నిందితుల్ని ఐదు రోజుల పాటు కస్టడీ కోరుతూ బంజారా హిల్స్ పోలీసులు పిటీషన్ దాఖలు చేసారు.

నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కస్టడీ పిటిషన్, నిందితుల బెయిల్ పిటిషన్ పై రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిందితుల కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

కాల్ డేటా ఆధారంగా డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి వివరాలు, వినియోగించిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. అనుమానితుల శాంపిల్స్ సేకరించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

Also Read :YS Jagan Mohan Reddy : సాయంత్రం ప్రధానిని కలవనున్న ఏపీ సీఎం జగన్