YS Jagan Mohan Reddy : సాయంత్రం ప్రధానిని కలవనున్న ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

YS Jagan Mohan Reddy : సాయంత్రం ప్రధానిని కలవనున్న ఏపీ సీఎం జగన్

jagan with modi

YS Jagan Mohan Reddy :  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం గం.4-30 కి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఈ భేటీలో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు గురించి వివరించి, కేంద్ర సాయాన్ని కోరే అవకాశం ఉంది.

ఏపీ లో పలు పెండింగ్ అంశాలు,రాష్ట్రానికి కేంద్ర సహకారం పై కూడా జగన్ , ప్రధానితో చర్చించనున్నారు. జగన్ సాయంత్రం 6 గంటలకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు.  పోలవరం  ప్రాజెక్ట్ తో  సహా రాష్ట్రానికి సంబంధించిన పలు  పెండింగ్ అంశాలను ఆమెతో ఆయన చర్చించనున్నారు. అనంతరం రాత్రి గం.9-30 కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అవుతారు.

ముఖ్యమంత్రి జగన్ రేపు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు   కేంద్రానికి వైసీపీ మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా జగన్ ప్రధానితో  చర్చించే అవకాశం ఉంది.

Also Read : CM Jagan Convoy : సీఎం జగన్ కాన్వాయ్ మధ్యలో నుండి 108 వాహనాన్ని పంపించిన పోలీసులు

కాగా ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌కు   ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన వారిలో ఎంపీలు  విజ‌య‌సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డి, మార్గాని భ‌ర‌త్‌, వంగా గీత‌, మాధ‌వి, అయోధ్య‌రామిరెడ్డి, వేమిరెడ్డి, గురుమూర్తి, మాధ‌వ్‌, రంగ‌య్య‌, రెడ్డ‌ప్ప‌, స‌త్య‌వ‌తి, కోట‌గిరి శ్రీ‌ధ‌ర్, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ తదితరులు ఉన్నారు.