CM Jagan Convoy : సీఎం జగన్ కాన్వాయ్ మధ్యలో నుండి 108 వాహనాన్ని పంపించిన పోలీసులు

సీఎం జగన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆపారు. వాహనాలను క్లియర్ చేసి 108 వాహనాన్ని పంపారు.

CM Jagan Convoy : సీఎం జగన్ కాన్వాయ్ మధ్యలో నుండి 108 వాహనాన్ని పంపించిన పోలీసులు

Cm Jagan

CM Jagan convoy 108 vehicle : ఏపీ పోలీసులు పేషెంట్ పట్ల ఔదార్యం చూపారు. సీఎం కాన్యాయ్ మధ్యలో నుంచి 108 అంబులెన్స్ వాహనాన్ని పంపారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ కాన్వాయ్ మధ్యలో నుండి 108 వాహనాన్ని పోలీసులు పంపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి వస్తున్నారు. అదే సమయంలో గన్నవరం నుండి విజయవాడ వైపు వెళ్లేందుకు 108 వాహనం వచ్చింది.

అప్పటికే సీఎం జగన్ కాన్వాయ్ కోసం పోలీసులు వాహనాలు ఆపారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేసి 108 వాహనాన్ని పంపారు. 108 వాహనం ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్దకు వచ్చేసరికి సీఎం కాన్వాయ్ పాసింగ్ అయింది. సీఎం కాన్వాయ్ మధ్యలో ఆపి పోలీసులు 108 వాహనాన్ని పంపారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరారు.

Ap cm jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ.. కేంద్ర మంత్రులను కలవనున్న జగన్

సాయంత్రం 4:30కి ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలవనున్నారు. రాత్రి 9:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జగన్ సమావేశం కానున్నారు. రేపు గజేంద్ర సింగ్ షేకావత్ సహా పలువురు కేంద్రమంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. ఏపీ పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి కేంద్ర సహకారంపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించనున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్రానికి నిధుల అంశాన్ని చర్చించనున్నారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కేంద్రానికి వైసీపీ మద్దతుపైనా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. ప్రధానితో భేటీ అనంతరం రాత్రి 8 గంటలకు హోమంత్రి అమిత్ షా ను సీఎం జగన్ కలవనున్నారు.