Ap cm jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ.. కేంద్ర మంత్రులను కలవనున్న జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర సహకారం పై ప్రధానితో...

Ap cm jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ.. కేంద్ర మంత్రులను కలవనున్న జగన్

Ap Cm Jagan

Ap cm jagan : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర సహకారం పై ప్రధానితో చర్చించనున్నారు. తాజా ఏపీలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సోమవారం నూతన జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. నూతన జిల్లాల ఏర్పాటు విషయంపై ప్రధాని మోదీ దృష్టికి జగన్ తీసుకెళ్లే అవకాశాలున్నాయి. అదేవిధంగా పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపైనా మోదీతో చర్చిస్తారని తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు అంశంపైనా మోదీ దృష్టికి తీసుకెళ్తారని, మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని మోధీని జగన్ కోరనున్నట్లు సమాచారం. విభజన చట్టం పెండింగ్ అంశాల అమలు తదితర విషయాపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Ap cm jagan : రేపు ఢిల్లీకి సీఎం జగన్.. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ ..

మరోవైపు త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీకి యూపీలో మెజార్టీ రావడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి సమస్య లేకపోయినప్పటికీ ఏపీలో సంపూర్ణ మెజార్టీ ఉన్న వైసీపీ నుంచి మద్దతు తీసుకోవటం కూడా అవసరమని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీలో రాష్ట్రపతి ఎన్నికల అంశంపైనా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. రాత్రి 8గంటల సమయంలో అమిత్ షాను జగన్ కలవనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలను అమిత్ దృష్టికి జగన్ తీసుకెళ్తారని తెలుస్తొంది. ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు బుధవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కలవనున్నట్లు సమాచారం.