కోడలితో అక్రమ సంబంధం : కొడుకును ముక్కలుగా నరికేశాడు

  • Published By: madhu ,Published On : February 17, 2019 / 05:43 AM IST
కోడలితో అక్రమ సంబంధం : కొడుకును ముక్కలుగా నరికేశాడు

Updated On : February 17, 2019 / 5:43 AM IST

సభ్యసమాజం తలదించుకొనే ఘటన. వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. తప్పని తెలిసినా సంబంధాలు పెట్టుకుంటూ కన్నవారినే తెగ నరుకుతున్నారు. కూతురిగా చూసుకోవాల్సిన కోడలితో ఓ మామ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అడ్డుగా ఉన్న కుమారుడిని ముక్కలు ముక్కలుగా నరికి డ్రైనేజీలో పడేశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అత్యంత పాశవికంగా..దారుణంగా జరిగిన ఈ ఘటన పంజాబ్‌లోని ఫరీదాకోట్‌‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…ఫరీదాకోట్‌లో చోటా సింగ్ (60) కొడుకు రాజ్వీందర్ సింగ్ నివాసం ఉంటున్నారు. రాజ్వీందర్ సింగ్‌కు 12 ఏళ్ల క్రితం జస్వీర్ కౌర్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే చోటా సింగ్..జస్వీర్‌పై కన్నేశాడు. లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. మెల్లిగా మగ్గులోకి దించాడు. జస్వీర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న రాజ్వీందర్ సింగ్ తండ్రిని పలుమార్లు హెచ్చరించాడు. 

ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం రాత్రి గదిలో పడుకున్న రాజ్వీందర్ సింగ్‌పై పదునైన కత్తితో చోటా సింగ్ దాడి చేశాడు. చనిపోయిన అనంతరం బాడీని ముక్క ముక్కలు చేశాడు. బ్యాగుల్లో పెట్టి డ్రైనేజీలో పడేశాడు. ఘటనతో మేనల్లుడు గురుచాన్ సింగ్ లేచాడు. గదిలో చూసే సరికి రక్తంతో ఉండడం గమనించి పోలీసులకు తెలియచేశాడు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు చోటా సింగ్‌ని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.