Rajasthan : అతను శివుడట, చంపేసి మళ్లీ బతికిస్తాడట .. కిరాతకంగా వృద్ధురాలు హత్య

ఓ మనిషి మూఢత్వానికి ఓ వృద్ధురాలు ప్రాణాలు పోయాయి. మద్యం మత్తు మహిళ ప్రాణాలు తీసింది. మద్యం మత్తుల్లో విచక్షణ మరచిన వ్యక్తి పాల్పడిన అకృత్యానికి 85 వృద్ధురాలు బలైపోయింది.

Rajasthan : అతను శివుడట, చంపేసి మళ్లీ బతికిస్తాడట .. కిరాతకంగా వృద్ధురాలు హత్య

Rajasthan

Updated On : August 7, 2023 / 9:54 AM IST

Rajasthan Crime : నేను శివుడ్ని నిన్ను చంపేసి మళ్లీ బతికిస్తా అంటూ 70 ఏళ్ల వ్యక్తి దారిపోయే వృద్ధురాలిపై దాడికి తెగబడ్డాడు. ఇష్టమిచ్చినట్లుగా దారుణంగా కొట్టాడు.ఆమెగుండెలమీద పిడిగుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు తాళలేక పాపం ఆ వృద్ధురాలి అల్లాడిపోయింది. అక్కడికి అతగాడు ఆగలేదు. పశుబలానికి తోడి మద్యం మత్తు కూడా ఎక్కటంతో చేతిలో ఉన్న గొడుగుతో ఆమెపై మరింతగా దాడి చేశాడు.పాపం అసలే వద్ధాప్యం ఈ దెబ్బలకు తాళలేకి ఆమె చనిపోయింది.

తాగుబోతు వీరంగం బాగుంది అనుకున్నారో ఏమోగానీ తమ కళ్లముందు అంత దారుణం జరుగుతున్నా ఏమాత్రం ఆపటానికి కూడా యత్నించకుండా ఇద్దరు మగపిల్లలు ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తామేదో ఘనకార్యం చేసినట్లుగా..రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలోని గోగుండా తహసీల్ పరిధిలో జరిగిన ఈ కిరాతక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Uttar Pradesh: మనుషులు మరీ ఇలా ఎలా ఉంటారు? చిన్నపిల్లల చేత మూత్రం తాగించి, వారి జననాంగాల్లో కారం చల్లారు

ప్రతాప్‌సింగ్ అనే 70 వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి ఉన్నాడు. బాగా తూగుతున్నాడు. ఈక్రమంలో అటుగా వెళుతున్న కల్కిబాయ్ గమేతి అనే 85 వృద్ధురాలిపై తన ప్రతాపం చూపించాడు. తాను శివుడిని అంటూ ఊగిపోయాడు. మద్యం తాగినవాడికి తనకంటే బలవంతుడు..తనకు తానే మహారాజును అనుకంటాడట. కానీ ఈ మందుబాబు మాత్రం ఏకంగా తాను పరమశివుడ్ని అనుకున్నాడు. అంతే ‘‘నేను శివుడ్ని నిన్ను చంపేసి మళ్లీ బతికిస్తా’’అంటూ ఆమెపై దాడికి తెగబడి గండెలమీద పిడిగుద్దులు కురిపించాడు. దెబ్బలకు తాళలేక కింద పడిపోయిన ఆమెను గొడుగుతో ఇష్టానుసారంగా చావబాదాడు. ఆ దెబ్బలు తాళలేక ప్రాణాలు వదిలేసింది. కానీ ఆ మందోన్మాదుడికి తలకు ఎక్కిన కిక్కుదిగలేదు. ఆమె చనిపోయిందని కూడా గుర్తించకుండా ఇష్టమొచ్చినట్లుగా వాగుతు పిచ్చి పిచ్చిగా వ్యవహరించాడు.

అతను ఆమెపై దాడి చేస్తుంటే అక్కడే ఉన్న ఇద్దరు మగపిల్లలు ఏమాత్రం అడ్డుకోలేదు. సరికదా తమ వద్ద ఉన్న ఫోన్లతో వీడియో తీశారు. ఈ ఘటన వైరల్ కావటంతో పోలీసులు దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారికి విచారిస్తున్నామని ఉదయ్‌పూర్ ఎస్పీ భువన్ భూషన్ వెల్లడించారు.