RANGE ROVER టెస్ట్ డ్రైవింగ్ లో యాక్సిడెంట్ : బెంగళూరు వ్యాపారవేత్త మృతి

RANGE ROVER టెస్ట్ డ్రైవింగ్ లో యాక్సిడెంట్ : బెంగళూరు వ్యాపారవేత్త మృతి

Updated On : March 27, 2019 / 10:21 AM IST

కారు టెస్ట్ డ్రైవ్ కి అని వచ్చి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడో వ్యాపారవేత్త. మార్చి 26వ తేదీ మధ్యాహ్నం బెంగళూరులో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త సాగర్. ‘మైసూర్ సిటీలో ఇంటరీయర్ డిజైనింగ్‌లో బిజినేస్ మాన్ గా పేరుంది. రేంజ్ రోవర్ కారు కొనాలని అనుకున్నాడు. పెద్ద కారు.. అందులోనూ కలకన్నాడు. దీంతో ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని షోరూమ్‌కు వెళ్లాడు. వెళుతూ ఫ్రెండ్‌ను కూడా తీసుకెళ్లాడు. రేంజ్ రోవర్ కారు టెస్ట్ డ్రైవర్ చేసి కొనాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఫ్యామిలీతో సహా కారు ఎక్కారు. 

బిజినెస్ మెన్ సాగర్‌తో పాటు డెమో కార్ డ్రైవర్ శివకుమార్ ను ఇచ్చి టెస్టు డ్రైవ్ కు పంపారు షోరూమ్ వాళ్లు. హైవేపై స్పీడుగా వెళుతున్నాడు. ఓవర్ స్పీడ్ లో.. కారును అదుపు చేయడం కుదరని సాగర్.. పీఈఎస్ కాలేజీ సమీపంలో టోల్ ప్లాజ్ దగ్గరకు రాగానే ఓ సిమెంట్ దిమ్మెకు ఢీకొట్టాడు. వేగానికి కారు పల్టీలు కొడుతూ.. 10 మీటర్ల వరకూ ఈడ్చుకుని వెళ్లింది. 

కారులో సాగర్, తన భార్య సంధ్య, కొడుకు సమర్త, ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతం, డెమో కార్ డ్రైవర్ శివ కుమార్ ఉన్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. సాగర్ దారిలోనే చనిపోయాడు. కొడుకు సమర్త, గౌతంలకు గాయాలయ్యాయి. సాగర్ భార్య వెన్నెముకకు గాయం అవడంతో హాస్సిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. శివకుమార్.. వేరే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు’ అని పోలీసులు వెల్లడించారు. 

సాగర్ మృతదేహాన్ని బీజీఎస్ గ్లోబల్ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత కుటుంబ సభ్యులకు బుధవారం మార్చి 27న అందజేయనున్నారు. రేంజ్ రోవర్ టెస్ట్ డ్రైవింగ్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యాపారవేత్త వార్త అందరినీ విషాదంలో నింపింది.

యాక్సిడెంట్ జరిగిన తీరు బీభత్సంగా ఉంది. కొత్త రేంజ్ రోవర్ కారు తుక్కుతుక్కు అయ్యింది. సమయానికి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావటం వల్ల ఇతర కుటుంబ సభ్యులు సేఫ్ గా బయటపడ్డారు. లేకుండా మొత్తం ఫ్యామిలీకి జరగరాని నష్టం జరిగేది అంటున్నారు.