బౌద్ధ క్షేత్రంలో యువతిపై అత్యాచారం, హత్య

బౌద్ధ క్షేత్రంలో యువతిపై అత్యాచారం, హత్య

Updated On : February 24, 2019 / 12:41 PM IST

కామ పిశాచుల దాహానికి మరో ప్రేమజంట బలైపోయింది. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి సమీపంలో బౌద్ధ క్షేత్రంలో కిరాతకం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై దాడి చేసి ఈ అకృత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

యువకుడు తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. యువతి మృతి చెందినట్లు పోలీసులు నిర్దారించారు. ప్రాథమిక విచారణలో ఆమెను అత్యాచారం చేసి హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. 

ఆమెతో పాటు వచ్చిన యువకుడు భీమడోలు మండలం అజ్జావారిగూడేనికి చెందిన నవీన్‌గా గుర్తించారు. విచారణను వేగవంతం చేసి నేరస్థుల్ని వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.