పెళ్ళి వద్దంది : యాసిడ్ దాడి చేసిన ప్రియుడు

పెళ్ళి చేసుకోటానికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిపై ఓ ప్రియుడు యాసిడ్ దాడి చేశాడు.తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  • Published By: chvmurthy ,Published On : January 19, 2019 / 07:05 AM IST
పెళ్ళి వద్దంది : యాసిడ్ దాడి చేసిన ప్రియుడు

Updated On : January 19, 2019 / 7:05 AM IST

పెళ్ళి చేసుకోటానికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిపై ఓ ప్రియుడు యాసిడ్ దాడి చేశాడు.తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

చెన్నై: పెళ్లిచేసుకోవటానికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు వితంతువుపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. 
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో నివసించే వితంతువు(36)కు అదే ప్రాంతంలో ఉండే జాన్ రోస్ (29) అనే యువకుడితో పరిచయంఏర్పడింది. ఈపరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లకు ఆ యువకుడు వితుంతువును పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయసాగాడు. ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న తాను మళ్ళీ పెళ్లి చేసుకోనని ఆవితంతువు తేల్చి చెప్పింది. గత మంగళవారం  ఆమె ఇంటికివెళ్ళిన యువకుడు తిరిగి పెళ్ళిప్రస్తావన తెచ్చి ఆమెపై ఒత్తిడి తీసుకు వచ్చాడు. ఎట్టి పరిస్ధితుల్లోనూ పెళ్లి  చేసుకునేది లేదని ఆమె తేల్చి చెప్పటంతో ఆగ్రహించిన యువకుడు ఆమెపై యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు.
ముఖం. ఒంటిపై గాయాలైన ఆమెను సమీపంలోని వారు అచ్చారిపల్లం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను అరెస్టు చేస్తారని భయం వేసిన యువకుడు శుక్రవారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.