అనంతలో రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

అనంతపురం జిల్లాలో శుక్రవారం(ఏప్రిల్ 12, 2019) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయర రహదారి రక్తసిక్తమైంది. లారీ-మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 02:18 AM IST
అనంతలో రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

Updated On : April 12, 2019 / 2:18 AM IST

అనంతపురం జిల్లాలో శుక్రవారం(ఏప్రిల్ 12, 2019) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయర రహదారి రక్తసిక్తమైంది. లారీ-మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు

అనంతపురం జిల్లాలో శుక్రవారం(ఏప్రిల్ 12, 2019) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఎదురెదురుగా వచ్చిన లారీ-మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తనకల్లు మండలం పరకులవాండ్లపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పాట్ కి వచ్చారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదానికి అతివేగమే కారణం అని పోలీసులు చెబుతున్నారు.

శుక్రవారం ఉదయం 7గంటలకు ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతులంతా తనకల్లు మండలానికి చెందినవారు. అనంతపురం నుంచి కదిరికి 90 కిలోమీటర్ల ప్రయాణం. బస్సులు తక్కువగా ఉండటంతో మినీ బస్సులు నడుపుతున్నారు. డబ్బు ఆశతో మినీ బస్సులో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. మినీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం కాదని ఆర్టీసీ అధికారులు తరుచూ చెబుతూనే ఉన్నారు. ఊరికి త్వరగా వెళ్లాలనే ఆత్రుతతో ప్రజలు మినీ బస్సులను ఆశ్రయిస్తున్నారు.

మినీ బస్సుల డ్రైవర్లు అతివేగంగా వాహనాలు నడుపుతున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించాలని, తమ రూట్ లో బస్సు సర్వీసులు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని ప్రాణాలు పోకముందే మేల్కోవాలని కోరుతున్నారు.