అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

  • Published By: chvmurthy ,Published On : March 19, 2019 / 02:56 AM IST
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి జాతీయ రహదారి వద్ద  మంగళవారం తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  నలుగురు అక్కడి కక్కడే మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  గుత్తి సమీపంలోని పెద్ద వడుగూరు మండలం టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని, అంబులెన్స్ ఢీ కొట్టటంతో ఈ దుర్ఘటన జరిగింది.  గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన వారు గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన రైతులుగా తెలుస్తోంది. ఘటనా స్ధలానికిచేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.  ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.