మంత్రి పువ్వాడ అజయ్ కు తప్పిన ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో సోమవారం (ఫిబ్రవరి 17, 2020) మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్ లో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ లోని పలు వాహనాలు ధ్వంసం చేశారు. స
బైక్ ను తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని వెంగళరావు పార్క్ వద్ద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి వేరే వాహనంలో వెళ్లిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.