Covid Death : కోవిడ్‌తో చనిపోయిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ. 34 లక్షలు మాయం
ఇటీవల కోవిడ్ సోకి చనిపోయిన తన భర్త బ్యాంకు ఎకౌంట్ నుంచి రూ. 34 లక్షల రూపాయలు మాయం అయినట్లు గుర్తించింది.

money transfer from deceased man bank account
Covid Death : కోవిడ్ సోకి ఇటీవల చాలామంది కన్నుమూశారు. చిన్నా పెద్దా, బీద బిక్కి తేడా లేకుండా ఎందరో కరోనా మహమ్మారికి బలైపోయారు. ఇటీవల కోవిడ్ సోకి చనిపోయిన తన భర్త బ్యాంకు ఎకౌంట్ నుంచి రూ. 34 లక్షల రూపాయలు మాయం అయినట్లు గుర్తించింది.
హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన నజియా అనే మహిళ భర్త ఇటీవల కోవిడ్ తో మరణించాడు. భర్త మరణించిన తర్వాత ఆ.న ఫోన్, వాలెట్ కనిపించలేదు. మరణానంతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆస్పత్రికి ఎంత ఖర్చు అయిందో లెక్క చూసేందుకు ఆమెబ్యాంకు స్టేట్ మెంట్ డౌన్ లోడ్ చేసి తీసుకున్నారు.
అందులో భర్త అకౌంట్ నుంచి రూ. 34 లక్షల నగదు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించింది. దీంతో ఆమె తనకు వ న్యాయం చేయాలని కోరుతూ సోమవారం సీటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.