స్కూల్ మాస్టారు.. దొంగల ముఠాకు లీడర్.. అడ్డంగా దొరికేసరికి..

  • Published By: sreehari ,Published On : August 16, 2020 / 08:18 PM IST
స్కూల్ మాస్టారు.. దొంగల ముఠాకు లీడర్.. అడ్డంగా దొరికేసరికి..

Updated On : August 17, 2020 / 10:33 AM IST

దొంగలకు దొంగ.. స్కూల్ మాస్టారు.. దొంగల ముఠాకు లీడర్.. ప్రైవేటు స్కూళ్లో పాఠాలు చెప్పే మాస్టరూ.. దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు.. అతడితో పాటు మరో నలుగురిని శంషాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి 17 తులాల బంగారు, 35 తులాల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.



సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరాల ప్రకారం.. గుంటూరు చిలకలూరిపేట కృష్ణానగర్‌కు చెందిన కోసూరి శ్రీనివాసరావు (54) వనపర్తిలోని ప్రైవేటు పాఠశాలలో 2009లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 10 తులాల నగలను తాకట్టు పెట్టించి రుణం ఇప్పించాడు. అప్పటి నుంచి శ్రీనివాసరావు చోరీలకు బాగా అలవాటు పడిపోయాడు.



యుగంధర్ కుమార్, శంకర్ నాయక్, మల్లెచెరువు రామారావు(51), చింతల సిసింద్రి(24), మువ్వ సురేష్ బాబు(43), కోటేశ్వర రావు, జల్లపల్లి నర్సింగ్రావు, చంటితో దొంగల ముఠా ఏర్పాటు చేశాడు.. వీరిలో ఎవరైనా పోలీసులకు చిక్కితే.. అరెస్టయితే జామీను ఇప్పించేవాడు. తెలుగు రాష్ట్రాల్లో 48 చోరీ కేసులతో అతడికి లింకు ఉందని పోలీసులు తేల్చేశారు.. శ్రీనివాసరావును అరెస్టు పోలీసులు చేశారు.