Second Wife Kills Husband : పర పురుషులను సుఖపెట్టమంటున్నాడని భర్తను….
రెండో భార్యగా ఉన్న తనను పర పురుషుల వద్ద పడుకోమని చెపుతున్నాడని ఓ మహిళ భర్తను హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

Extra Marital Affair
Second Wife Kills Husband : రెండో భార్యగా ఉన్న తనను పర పురుషుల వద్ద పడుకోమని చెపుతున్నాడని ఓ మహిళ భర్తను హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
కర్ణాటకలో రియల్ ఎస్టేట్ బూమ్ బాగా ఉండటంతో బెంగుళూరుకు చెందిన పలార్ స్వామి, అలియాస్ స్వామిరాజ్ బెంగళూరు ఉత్తర తాలూకాలో లేఔట్లు వేసి కోట్ల రూపాయలు ఆర్జించాడు. పలార్ స్వామికి పెళ్లై భార్య ఉంది. వ్యాపారంలో విపరీతంగా లాభాలు వచ్చి, కోట్లు ఆర్జించటంతో విలాసంగా గడప సాగాడు.
ఈ క్రమంలో అతనికి ఆరేళ్ల కిందట బ్యూటీషియన్ నేత్ర పరిచయం అయ్యింది. ఆ పరిచయం క్రమేపి వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ళకు నేత్రను కూడా వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు హారో క్యాతనహళ్లి వద్ద ఆరు కోట్ల రూపాయలతో విలాసవంతమైన బంగ్లా నిర్మించి ఇచ్చాడు. గత ఆదివారం పలార్ స్వామి హత్యకు గురయ్యాడు.
పలార్ స్వామిని హత్య చేసిన రెండో భార్య నేత్ర… మాదనాయకనహళ్లి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగి పోయింది. పలార్ స్వామి తనను పరాయి పురుషులను సుఖపెట్టమని వేధిస్తున్నాడని…వారి వద్దకు వెళ్లి పడుకోమని చెపుతున్నాడని…. అందుకే భర్తను హత్య చేశానని పోలీసుల ముందు నేరం ఒప్పుకుంది. కాగా…తమను పిల్లలను బాగా చూసుకుంటున్నాడనే కోపంతోనే నేత్ర తన భర్తను హత్య చేసిందని అతని మొదటి భార్య ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.