అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో శిశువు తల తెగిన ఘటనలో సంచలన నిజాలు 

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు తల తెగిన ఘటనలో సంచలన నిజాలు వెలుగుచేశాయి. బాధితురాలి పరిస్థితిని చూడకుండానే వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు.

  • Published By: veegamteam ,Published On : December 21, 2019 / 09:53 AM IST
అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో శిశువు తల తెగిన ఘటనలో సంచలన నిజాలు 

Updated On : December 21, 2019 / 9:53 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు తల తెగిన ఘటనలో సంచలన నిజాలు వెలుగుచేశాయి. బాధితురాలి పరిస్థితిని చూడకుండానే వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు తల తెగిన ఘటనలో సంచలన నిజాలు వెలుగుచేశాయి. బాధితురాలి పరిస్థితిని చూడకుండానే వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు. సినిమా దృశ్యాన్ని తలపించేలా వైద్యులు సీన్ క్రియేట్ చేశారు. శిశువు తల తెగగానే గోప్యంగా అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. తల గురించి బంధువులు అడిగితే తమకు తెలియదని బుకాయించారు. కేస్ షీట్ కూడా ఇవ్వకుండా వైద్యులు పేషెంట్ ను తరలించారు. సూపరింటెండెంట్ తారాసింగ్, డాక్టర్ సుధారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. ఘటనపై విచారణ జరిపేందుకు అధికారులు కమిటీ వేశారు.

నడింపల్లి గ్రామానికి చెందిన స్వాతి అనే గర్భిణి ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అయితే కాన్పు సమయంలో ఆపరేషన్ చేసిన వైద్యులు శిశువు తల కోసేశారు. బాధితురాలి పరిస్థితిని చూడకుండానే వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు. పరిస్థితి సీరియస్ గా ఉందని హైదరాబాద్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. శిశువు తల తెగగానే గోప్యంగా అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. శిశువు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆగ్రహించిన గర్భిణి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 

ప్రసవ సమయంలో డాక్టర్లు శిశువు మొండెం నుంచి తలను వేరుచేశారని ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి దగ్గరకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రసవ సమయంలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు, వైద్య సిబ్బందిపై బాధితురాలి బంధువులు దాడికి ప్రయత్నించారు. అడ్డుకున్న కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి.