TSPSC Paper Leak : ఆ యువతి కోసమే.. TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో సంచలన ట్విస్ట్
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో కొత్త కోణం బయటపడింది. ఓ యువతి కోసం పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు దర్యాఫ్తులో వెల్లడైంది. టీఎస్ పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ కోసం తరుచుగా ఓ యువతి వచ్చేదని, ఆమె కోసమే పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. (TSPSC Paper Leak)

TSPSC Paper Leak : టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో కొత్త కోణం బయటపడింది. ఓ యువతి కోసం పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు దర్యాఫ్తులో వెల్లడైంది. టీఎస్ పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ కోసం తరుచుగా ఓ యువతి వచ్చేదని, ఆమె కోసమే పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పేపర్ ఇవ్వాలని ఆ యువతి ప్రవీణ్ ను కోరటంతో.. ఆమె కోసం టౌన్ ప్లానింగ్ పేపర్ ను ప్రవీణ్ లీక్ చేసినట్లు గుర్తించారు. టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ హ్యాకింగ్ జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఇవాళ జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షతో పాటు 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు సైతం వాయిదా వేసినట్లు కమిషన్ తెలిపింది.(TSPSC Paper Leak)
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపింది. టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ హ్యాకింగ్ జరిగిందని ముందు అనుకున్నారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. వెబ్ సైట్ హ్యాకింగ్ జరగలేదని నిర్ధారణ అయ్యింది. కమిషన్కు చెందిన ఓ ఉద్యోగి.. ఓ యువతి కోసం పేపర్ లీక్ చేసినట్టు తేలింది.
పేపర్ లీకేజీ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేయగా.. హనీట్రాప్ కోణం వెలుగుచూసింది. టీఎస్పీఎస్సీ ఆఫీస్ కు ఇటీవల తరచుగా ఓ యువతి రావడాన్ని గమనించారు. ప్రవీణ్ కోసం ఆ యువతి వచ్చేదని గుర్తించారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్కు గాలం వేస్తూ సన్నిహితంగా మెలిగింది. ఈ క్రమంలో తనకు పేపర్ ఇవ్వాలని కోరగా, ఆమె కోసం పేపర్ ను ప్రవీణ్ లీక్ చేసినట్టు గుర్తించారు. యువతి కోసమే టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీ జరిగిందని అధికారులు నిర్ధారించారు. నిందితుడు ప్రవీణ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పేపర్ లీక్ ఎఫెక్ట్ ఇతర పరీక్షల నిర్వహణపైనా పడింది. టౌన్ ప్లానింగ్, పశు సంవర్థక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కిందనే అనుమానంతో కమిషన్ ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 12న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇక ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.