Telangana : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారు,చెప్పినట్లు వినాలని బెదిరిస్తున్నారు : మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఓ మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని..లైంగికంగా వేధిస్తున్నారని..అతని అనుచరులతో కూడా ఫోన్లు చేయించి వేధిస్తున్నారు అంటూ హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలు పెను సంచలనంగా మారాయి.

Telangana : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారు,చెప్పినట్లు వినాలని బెదిరిస్తున్నారు : మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు

brs mla tatikonda rajaiah is harassmets allegation of woman sarpanch

Telangana : బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఓ మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని..లైంగికంగా వేధిస్తున్నారని..అతని అనుచరులతో కూడా ఫోన్లు చేయించి వేధిస్తున్నారు అంటూ హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య చేసిన ఈ ఆరోపణలు పెను సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే రాజయ్య ఫోన్లు చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళతానని సర్పంచ్ నవ్య కన్నీటితో తెలిపారు. ఇటువంటి నేతలతో బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఇటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నవ్య డిమాండ్ చేశారు. సర్పంచ్ నవ్య చేసిన ఈ ఆరోపణలు హన్మకొండ జిల్లాలో సంచలనంగా మారాయి. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని నవ్య అన్నారు.

భరించరాని ఇబ్బందులు పెడుతూ తాను చెప్పినట్లుగా చేయాలంటూ తనకు ఫోన్లు చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలు హన్మకొండ జిల్లాలో పెను సంచలనంగా మారాయి. సొంతపార్టీ మహిళా నేతలపై ఇటువంటి వేధింపులకు పాల్పడే నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. నేను చెప్పినట్లు చేయకపోతే రాజకీయ జీవితం ఉండదంటూ ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారని నవ్య 10టీవీతో ఆవేదన వ్యక్తంచేశారు. తనతోటి మహిళా నేతలే తనకు ఫోన్లు చేసిన రాజయ్య చెప్పినట్లుగా వినాలని వేధిస్తున్నారని నవ్య ఆరోపించారు. నువ్వు నాతో కలిసి బయటకు వస్తే నీకు కావాల్సినవన్నీ కొనిపెడతా..బంగారం కావాలా? నగలు కావాలా? నీ పిల్లల చదువులకు అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటానంటూ వేధిస్తున్నారని వాపోయింది నవ్య.

ఏం కావాలన్నా ఇస్తా నాకోరిక తీర్చు అంటున్నాడు : 
తన భార్య నవ్యపై రాజయ్య వేధింపుల గురించి సర్పంచ్ భర్త మాట్లాడుతూ..నువ్వు సర్పంచ్ అయ్యే అవకాశాన్ని నేనే ఇచ్చాను..నిన్ను చూసి అవకాశం ఇచ్చాను తప్ప వేస్ట్ గాడు నీ భర్తను చూసి ఇవ్వలేదని రాజయ్య అన్నారని తెలిపారు. నీకేం కావాలో చెప్పు క్షణాల్లో ఏర్పాటు చేస్తా? డబ్బు కావాలా? బంగారం కావాలా? ఏం కావాలన్నా ఇస్తానని నాకోరిక తీరిస్తే నీకు ఏం కావాలన్నా ఇస్తానంటూ ఫోన్లు చేసి వేధిస్తున్నారని అంతేకాకుండా రాజయ్య అనుచరులతో ముఖ్యంగా మహిళలతో ఫోన్లు చేయించి రాజయ్య చెప్పినట్లు విను నీకు రాజకీయంగా ఎదుగుతావు అని అంటున్నారంటూ చెప్పుకొచ్చారు.

లేదంటే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగవని..అలా జరగకపోతే నీకు రాజకీయ జీవితం ఉండదని బెదిరిస్తున్నారని..ఈ బెదిరింపులతో నా ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అందుకే ఎటువంటి కార్యక్రమాలకు వెళ్లటం లేదని ఇంటికే పరిమితం అయ్యాయని సర్పంచ్ నవ్య ఆరోపించారు. మరి సర్పంచ్ నవ్య చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.