తమిళనాడులో రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి 

  • Published By: chvmurthy ,Published On : May 6, 2019 / 03:58 PM IST
తమిళనాడులో రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి 

Updated On : May 6, 2019 / 3:58 PM IST

వేలూరు : చెన్నై బెంగుళూరు జాతీయ రహదారిపై  వేలూరు పరిధిలోని అంబూరు వద్ద సోమవారం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు ఉన్నారు. ఆగి ఉన్న కంటెయినర్ ను కారు ఢీ కొట్టడంతో ఈదుర్ఘటన జరిగింది.  మరణించిన వారు మహారాష్ట్రకు  చెందిన రైల్వే పోలీసు అధికారి మెల్విన్ దేశ్ ముఖ్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. తమిళనాడులో  పుణ్యక్షేత్రాలు దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.  ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.