పెళ్లికి ముందే మాటిచ్చి సెక్స్ చేస్తే రేప్ కాదు: హైకోర్టు

ఓ ప్రత్యేకమైన కేసులో ఒడిశా హైకోర్టు వినూత్నమైన తీర్పు ఇచ్చింది. పెళ్లికి ముందే మాటిచ్చి సెక్స్ చేస్తే దానిని రేప్ కింద పరిగణించరని హైకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి వీటిపై ప్రశ్నలు లేవనెత్తి.. రిలేషన్ షిప్‌లను క్రమబద్దీకరించడానికి రేప్ చట్టాలు వాడుకోవచ్చని అన్నారు. ప్రత్యేకంగా మహిళలు వారికి ఇష్టమయ్యే రిలేషన్ షిప్ లో ఉండటాన్ని గుర్తు చేశారు.
కింది కోర్టుల ఆర్డర్ పై విచారణ చేపట్టిన జస్టిస్ పాణిగ్రాహి రేప్ నిందితుడి బెయిల్ పిటిషన్ ను పరిశీలించారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన విద్యార్థి అరెస్టు, రేప్ ఆరోపణలు నవంబరులో నమోదయ్యాయి. 19ఏళ్ల గిరిజన యువతితో పెట్టుకున్న సంబందం కేసులో అరెస్టు అయ్యాడు. కేసు వివరాల ప్రకారం.. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు.
నాలుగేళ్ల పాటు నడిచిన వ్యవహారంలో యువతి 2సార్లు గర్భం కూడా దాల్చింది. ఆ తర్వాత యువతి తన అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని తనను శారీరకంగా వాడుకున్నాడని.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడంటూ కేసు ఫైల్ చేసింది. అబార్షన్ పిల్స్ ఇచ్చి తన గర్భాన్ని కూడా తీసేయించాడని అందులో పేర్కొంది.
పోలీసులు కేస్ ఫఐల్ చేసి అతణ్ని ఆరు నెలల పాటు జైలులో ఉంచారు. గురువారం అతని బెయిల్ అప్లికేషన్ హైకోర్టుకు విచారణకు వచ్చింది. బాధితురాలిని ఇబ్బంది పెట్టని పక్షంలో.. న్యాయ విచారణకు కో ఆపరేట్ చేస్తాడనే నమ్మకంతో అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పును ఇచ్చింది.
‘పెళ్లి చేసుకుంటామని భావించిన కొందరు శారీరకంగానూ కలుస్తున్నారు. యువకుడు పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారం జరిగిందని యువతులు ఠాణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను అత్యాచారాలుగా పరిగణించరాద’ని కోర్టు తీర్పు ఇచ్చింది.