10tvతో శ్రిఖా చౌదరి : జయరాం మా ఇంటికొచ్చారు..కోటి అడిగారు

  • Published By: madhu ,Published On : February 7, 2019 / 01:27 PM IST
10tvతో శ్రిఖా చౌదరి : జయరాం మా ఇంటికొచ్చారు..కోటి అడిగారు

Updated On : February 7, 2019 / 1:27 PM IST

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుతో తనకు సంబంధం లేదని శ్రిఖా చౌదరి స్పష్టం చేశారు. ఈ కేసులో అనవసరంగా తనను ఇరికిస్తున్నారంటూ పేర్కొన్నారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిగురుపాటి జయరాం హత్య కేసు మిస్టరీలో సెంటర్ పాయింట్‌గా శ్రిఖా చౌదరి పాత్ర ఉందని ప్రచారం జరిగింది. దీనిని ఆమె కొట్టిపారేశారు. తన చుట్టూ తిరిగేలా క్రియేట్ చేశారని..బాధపడాల్సిన విషయంపై చర్చించాల్సి రావడం బాధాకరమన్నారు. 

దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకొనేందుకు శ్రిఖా చౌదరితో 10TV ముచ్చటించింది. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. జయరాం అడిగితేనే EXPRESS TVలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేయడం జరిగిందని తెలిపారు. జనవరి 29వ తేదీన ప్రాజెక్టు వర్క్‌కు సంబంధించి.. జయరాం తమింటికి వచ్చినట్లు చెప్పారు. అదే రోజు తన డ్రైవర్ ఆయన ఇంటి దగ్గర జయరాంను వదిలిపెట్టాడని వెల్లడించారు. జనవరి 30వ తేదీన తనకు ఫోన్ చేసి…4 కోట్ల రూపాయలు అప్పు చేశా..చాలా ఫ్రెషర్ ఉంది…ఇందుకు కోటి రూపాయలు కావాలంటూ జయరాం కోరినట్లు తెలిపారు. తన దగ్గర డబ్బు లేదని..మళ్లీ చెబుతానని చెప్పినట్లు…జనవరి 31 రోజు డబ్బు కోసం మళ్లీ ఫోన్ చేశారని తెలిపిన శ్రిఖా…డబ్బు ఎవరికి ఇవ్వాలని అడిగితే…వేరే వారికి ఇవ్వాలని జయరాం చెప్పినట్లు తెలిపారు. ఇంకా ఎలాంటి విషయాలు శ్రిఖా చెప్పారో..లైవ్..వీడియోలో చూడండి.