Shocking : బైక్‌లపైకి దూసుకెళ్లిన లగ్జరీ కారు.. షాకింగ్ దృశ్యాలు!
రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ లగ్జరీ కారు బీభత్స సృష్టించింది. జోధ్‌పూర్‌లోని రహదారిపై దూసుకొచ్చిన లగ్జరీ కారు అదుపు తప్పి బైకులను ఢీకొట్టింది.

Luxury Car, Bikers Injure, Jodhpur Road Accident, Amit Naagar, Cm Ashok Gehlot
Jodhpur luxury car Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ లగ్జరీ కారు బీభత్స సృష్టించింది. జోధ్‌పూర్‌లోని రహదారిపై దూసుకొచ్చిన లగ్జరీ కారు అదుపు తప్పి పలు ద్విచక్ర వాహనాల మీదకు దూసుకెళ్లింది. చివరికి రోడ్డు పక్కనున్న దుకాణాన్ని ఢీకొని కారు ఆగిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా, మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
#Rajasthan : shocking cctv footage of deadly accident when a speedy audi killed 3 in #Jodhpur #RoadSafety pic.twitter.com/tTCXp0axMh
— Ravish Pal Singh (@ReporterRavish) November 9, 2021
శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్‌లోని నందనవన్ గ్రీన్ ప్రాంతానికి చెందిన అమిత్ నాగర్ (50)గా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్రమాద ఘటనపై స్పందించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు.
जोधपुर के चोपासनी हाउसिंग बोर्ड क्षेत्र में एम्स रोड पर आज एक्सीडेंट में घायल हुए लोगों के परिजनों से एवं एम्स पहुंचकर अस्पताल में एडमिट मरीजों एवं उनके परिजनों से मिले तथा कुशलक्षेम जानी। pic.twitter.com/XVS9t77R0y
— Ashok Gehlot (@ashokgehlot51) November 9, 2021
ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులకు సీఎం గెహ్లాట్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తామని సీఎం భరోసానిచ్చారు.
Read Also : Life Sentence For Gang Rape : సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురికి జీవిత ఖైదు