షాకింగ్ నిజాలు..యువతి శరీరంలో బుల్లెట్

  • Published By: madhu ,Published On : December 24, 2019 / 12:35 PM IST
షాకింగ్ నిజాలు..యువతి శరీరంలో బుల్లెట్

Updated On : December 24, 2019 / 12:35 PM IST

అస్మా బేగం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం అస్మాను కింగ్స్‌ ఫంక్షన్‌ హాల్‌ ఓనర్‌ కుమారుడు జుబేర్‌ నాటు తుపాకీతో కాల్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. కింగ్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో అస్మా తండ్రి నజీర్‌ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఓ పెళ్లి బరాత్‌లో అస్మాపై జుబేర్‌ కాల్పులు జరిపాడు. గతంలో కాల్పుల కేసులో జుబేర్‌పై మైలార్‌ దేవులపల్లిలో కేసు నమోదైంది.

మొదట్లో బాడీలోకి బుల్లెట్‌ ఎలా వచ్చిందో తెలియదన్న అస్మా బేగం.. పోలీసు విచారణలో వివరాల వెల్లడించింది. అస్మా సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేసిన పోలీసులు.. కాల్‌ రికార్డ్స్‌ ద్వారా విచారిస్తున్నారు.  మరోవైపు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు యువతి కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. సర్జరీ అయిన మర్నాడే..ఆస్మా బేగంను డిశ్చార్జీ చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఫలక్ నుమాలోని జుహ్నుమా ఏరియాలో అస్మా బేగం నివాసం ఉంటోంది. 
కొన్ని రోజులుగా నడుం నొప్పితో బాధ పడుతుండేది. 
నిమ్స్‌కు వెళ్లగా..వైద్యులు పూర్తిగా పరీక్షించారు. 
 

నడుము భాగంలో బుల్లెట్ ఉండడం షాక్ తిన్నారు. 
వెంటనే పంజాగుట్ట పోలీసులకు కంప్లయింట్ చేశారు. 
ఫలక్ నుమా పోలీసులు రంగంలోకి దిగారు. 
 

యువతితో..ఆమె కుటుంబసభ్యులను విచారించారు.
తనకేం తెలియనది ముందుగా చెప్పింది. 
అస్మా బేగం శరీరంలో రెండు..మూడేళ్లుగా బుల్లెట్ ఉన్నట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు. 
తాజాగా విచారణలో వాస్తవాలు వెల్లడించింది. 
Read More : వీణా – వాణి :  10th Class హాల్ టికెట్లు ఒకటా ? రెండా ?