కేటుగాడు కేరాఫ్ పిఠాపురం: అక్కా చెల్లెళ్లను ట్రాప్ చేసి.. ఒకరికి తెలియకుండా ఒకరితో!

  • Published By: vamsi ,Published On : May 13, 2019 / 02:44 AM IST
కేటుగాడు కేరాఫ్ పిఠాపురం: అక్కా చెల్లెళ్లను ట్రాప్ చేసి.. ఒకరికి తెలియకుండా ఒకరితో!

Updated On : May 13, 2019 / 2:44 AM IST

అక్కకు తెలియకుండా చెల్లిని, చెల్లికి తెలియకుండా అక్కను మాయమాటలతో మోసం చేశాడు ఓ మాయగాడు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ట్రాప్ చేశాడు కేటుగాడు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన బి.హేమంత్ కుమార్‌.. స్థానిక జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న కిరాణాషాపుకు వచ్చే 19 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. అయితే ఆమెతోనే కాకుండా మైనర్ అయిన ఆమె చెల్లిని కూడా ట్రాప్ చేసి ఇదే రకమైన సంబంధం కొనసాగించాడు.

ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధాన్ని కొనసాగించిన కేటుగాడి విషయం కొన్నిరోజులకు బయటపడగా.. మీ న్యూడ్ ఫోటోలను నెట్‌లో పెడతానంటూ అక్కాచెళ్లెళ్లను బెదిరించాడు. అంతేకాకుండా వాటని స్నేహితులకు చూపించి వేధించాడు. వేధింపులు మితిమీరిపోవడంతో మైనర్ బాలిక తండ్రికి చెబుతానని హేమంత్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీంతో హేమంత్ కుమార్ తన స్నేహితులతో కలిసి ఆమెపై బ్లేడ్‌తో దాడి చేయగా.. విషయం ఇంట్లో తెలవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హేమంత్ కుమార్‌తో పాటు అతని స్నేహితులు అనిరుధ్ రెడ్డి, ప్రశాంత్‌లతో పాటు ఇద్దరు యువతులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.