కన్నతల్లిని వదిలేసి వెళ్లిన కసాయి కొడుకు 

నవమాసాలు మోసీ.. కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్లాడో కసాయి కొడుకు.

  • Published By: veegamteam ,Published On : February 17, 2019 / 04:02 PM IST
కన్నతల్లిని వదిలేసి వెళ్లిన కసాయి కొడుకు 

Updated On : February 17, 2019 / 4:02 PM IST

నవమాసాలు మోసీ.. కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్లాడో కసాయి కొడుకు.

మహబూబాబాద్‌ : అడ్డాల నాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు బిడ్డలు కాదు అంటారు. నవమాసాలు మోసీ.. కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్లాడో కసాయి కొడుకు. అనారోగ్యం పాలైన కన్నతల్లిని ఆస్పత్రిలో చేర్పిస్తానని తీసుకొచ్చి అనాధను చేశాడా కొడుకు.

వృద్ధురాలైన కన్నతల్లిని.. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. అనాథగా వదిలేశాడో కన్న కొడుకు. అనారోగ్యం పాలైన తల్లిని ఆసుపత్రి ఆవరణలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆరు రోజులుగా ఆస్పత్రి ఆవరణలో.. చెత్త కుప్పల మధ్య చలికి వణుకుతూ.. దుర్బర స్థితిలో ఉందా వృద్ధురాలు. కన్నకొడుకు వస్తాడని, తనను తీసుకెళ్తాడని ఎదురు చూస్తోంది.

విజయవాడకు చెందిన వృద్ధురాలు తాటి రాములమ్మకు ముగ్గురు కొడుకులు.. ఒక్క కూతురు ఉన్నారు. ఇద్దరు కొడుకులు చనిపోవడంతో పాపయ్య దగ్గర ఉంటుంది. రాములమ్మ నడుముకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పిస్తానని మహబూబాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. సివిల్‌ ఆస్పత్రి ఆవరణలోని బెంచిపై పడుకోబెట్టి.. ఇప్పుడే వస్తానని వెళ్లాడు. ఆరు రోజులైనా కొడుకు తిరిగిరాకపోవడంతో.. ఆ తల్లి తిండిలేక.. ఆకలికి అలమటిస్తూ.. చలికి వణికిపోతూ.. ఆరు రోజులుగా నరకం అనుభవిస్తుంది

వృద్ధురాలి దీనస్థితిపై 10 టీవీలో వార్తలు రావడంతో మహబూబాబాద్‌ సివిల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది ఆమెకు అన్నంపెట్టి ఆదరించారు. వృద్ధురాలి పరిస్థితిని చూసి స్థానికులు చలించిపోయారు. కన్నతల్లిని భారం అనుకున్న కొడుకులు బాగుపడరంటూ శాపనార్థాలు పెట్టారు.