తల్లిపై కొడుకు లైంగికదాడికి యత్నం : ఉరేసి చంపిన తల్లిదండ్రులు

కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గుడు వావివరసులు మరిచాడు. కన్నతల్లిపైనే కొడుకు లైంగిక దాడికి యత్నించాడు.

  • Published By: veegamteam ,Published On : December 17, 2019 / 10:51 AM IST
తల్లిపై కొడుకు లైంగికదాడికి యత్నం : ఉరేసి చంపిన తల్లిదండ్రులు

Updated On : December 17, 2019 / 10:51 AM IST

కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గుడు వావివరసులు మరిచాడు. కన్నతల్లిపైనే కొడుకు లైంగిక దాడికి యత్నించాడు.

మానవత్వం మంటగలిసిపోతోంది. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గుడు వావివరసులు మరిచాడు. తల్లీకొడుకుల అనుబంధానికి మచ్చతెచ్చాడు ఓ దుర్మార్గుడు. సభ్యసమాజం తలదించుకునే పనికి ఒడిగట్టాడు. కన్నతల్లిపైనే కొడుకు లైంగిక దాడికి యత్నించాడు. ఆగ్రహించిన తల్లిదండ్రులు అతన్ని చంపేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

అనంతపురం జిల్లాలోని శిరివరం గ్రామంలో యువకుడు ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. కామంతో కళ్లు మూసుకు పోయి, మద్యం మత్తులో కన్నతల్లిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు చీరతో కొడుకును ఉరేసి చంపేశారు. తరచూ తాగి ఇలాగే ప్రవర్తిస్తుండటంతో చంపేశామంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మద్యానికి బానిసైన యువత చెడు అలవాట్లకు లోనైపోతున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. సక్రమార్గంలో పయనించాల్సిన యువత తప్పుడు మార్గాల్లో పయనిస్తున్నారు. మద్యం, అశ్లీల చిత్రాలు, పోర్న్ వెబ్ సైట్లు… బాలురు, యువతను పెడధోరణిలో తీసుకెళ్తున్నాయి.